Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ అనగానే చిరాకు పడేవాళ్ళు కొందరైతే, బతికితే ఆర్జివి లాగా బతకాలి అనుకునేవాళ్ళు ఉన్నారు. ఇండియాలో ఫ్రీడమ్ వచ్చిన వ్యక్తి కేవలం ఆర్జివి మాత్రమే అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేస్తారు. నాకు నచ్చింది చేస్తా, నాకు నచ్చినట్టు ఉంటా అనేది ఆర్జివి తీరు. నన్ను ఇష్టపడే వాళ్ళైనా నన్ను ద్వేషించేవాళ్ళైనా నాకు చిరాకు అంటూ కుండబద్దలు కొట్టే ఆర్జీవి ఆ మధ్య యాంకర్ అషు రెడ్డి కాళ్ళు నాకడం బాగా వైరల్ అయింది. ఆమె కాళ్ల ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్జీవి ఆమె కాళ్లాను నాకడం అది నా అదృష్టం అనడం ఇవన్నీ చాలా మందికి నచ్చలేదు. అయితే కొంతమంది ఆర్జివి పరమభక్తులు మాత్రం ఆర్జీవి అంతే అనుకున్నారు. ఇక ఇదే విషయం మీద మరోసారి ప్రశ్న ఎదురైంది.
అమ్మాయి కాళ్ళు నాకడం అవసరమా…
అషురెడ్డి కాళ్ళు పట్టుకోవడం ఆమె కాలి వేళ్ళను నాకడం వంటి పనులు ఆర్జివి చేయడం అవసరమా అనే ప్రశ్న ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వర్మకి ఎదురవగా వర్మ చాలా సింపుల్ గా నా ఇష్టం అనేసాడు. ఎవరికి నచ్చదో వాళ్ళు చూడకుండా ఉంటే అయిపోతుంది కదా అంటూ సమాధానం చెప్పాడు.
నాకు నచ్చింది నేను చేస్తాను. నా అభిమానులకు నచ్చదు, నన్ను ఇష్టపడేవాళ్లకు నచ్చదు అని నేను నాకు నచ్చింది చేయకపోతే అది ఒక జబ్బులాగా మారిపోతుంది. నేను నాకోసం మాత్రమే బ్రతుకుతాను. ఈ ప్రపంచంలో నా గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను ఇంకెవరి కోసమో నేను బ్రతకను. అందుకే నన్ను ఇష్టపడేవాళ్ళు నాకు నచ్చరు, నన్ను ద్వేషించేవాళ్లు నాకు నచ్చరు అంటూ తన స్టైల్ ఆన్సర్ చెప్పాడు వర్మ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…