Analists Dasari Vignan &Damu Balaji : అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ అనే యువకుడి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపాడు హరిహర కృష్ణ అనే యువకుడు. తన ప్రియురాలు నిహారిక రెడ్డి తో చనువుగా ఉన్నాడన్న కోపంతో పార్టీకి అని పిలిచి అక్కడ గొడవ పడి దారుణంగా నవీన్ హత్య చేసి తల, మొండేం వేరు చేసి గుండెను మార్మాంగాలను అలానే వేళ్ళను సెపరేట్ చేసి ప్రియురాలికి వాట్సాప్ లో నవీన్ వేళ్ళను పంపి నిన్ను తాకిన వేళ్ళు ఇవే కదా అంటూ సందేశం పంపాడు. ఇక తరువాత పెదాలను పంపి నిన్ను ముద్దుపెట్టుకున్నది ఈ పెదాలే కదా అంటూ సందేశం పంపగా అందుకు నిహారిక వెరీ గుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస్తోంది.
నిహారిక అసలు విషయం చెప్పకపోవడం వల్లే ఇదంతా…
అనలిస్ట్స్ దాసరి విజ్ఞాన్ మరియు దాము బాలాజీ నవీన్ హత్య గురించి మాట్లాడుతూ ఈ హత్య విషయంలో నిహారిక రెడ్డి పాత్ర చాలా ఉంది అంటూ అభిప్రాయపడ్డారు. నిహారిక ఒకవైపు ఇంటర్ నుండి నవీన్ ను అలాగే బిటెక్ లో హరిహర ను ప్రేమించిందని ఒకేసారి ఇద్దరినీ ఇష్టపడిన నిహారిక వారితో ఈ విషయం చెప్పలేదు. గత కొద్ది నెలలుగా హరిహర కృష్ణ తో ఎక్కువగా చనువుగా ఉంటున్న నిహారిక నవీన్ తో చేసిన చాట్ గురించి హరిహర కు అనుమానము వచ్చి అడగడంతో నవీన్ తనను ప్రేమ పేరుతో వేదిస్తున్నాడని చెప్పింది. దీంతో స్నేహితుడైనా నవీన్ మీద పగ పెంచుకున్న హరిహర ఆ విషయం అతనితో మాట్లాడి సెటిల్ చేసుకోకుండా నవీన్ ను చంపాలని అనుకున్నాడు.
అలా మూడు నెలల ముందే ప్లాన్ చేసుకుని పార్టీ అని పిలిచి ఆ పైన గొంతు నులిమి చంపేసి ఆ తరువాత గుండె కోసి ఫోటో తీసి నిహారికకు పంపడం వంటి పైశాచిక పనులను చేసాడు. విషయం నిహారికకు, హరిహర స్నేహితుడు హాసన్ అలాగే హరిహర తండ్రి కి ఆరోజే తెలిసినా హరిహర తండ్రి మొదట తెలియదని, తెలిసిన వెంటనే లొంగిపోమని చెప్పానంటూ చెప్పారు. ఇక నిహారిక, హరిహర, నవీన్ ను ఎలా ఏమరచిందో పోలీసులను అలాగే ఏమారుస్తోందని రెండు సార్లు విచారణకు వచ్చినా ఏమి తెలియదు అంటూనే చెబతోంది అంటూ దాసరి విజ్ఞాన్, దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…