interesting details about relationship between rajamouli and actor harsha vardhan
Director Rajamouli : తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి సినిమా అంటే ఇష్టముండని వారుండగారు. ఆయన తీసిన ప్రతీ సినిమాలో ఏదో కొంత విషయం ఉండడంతో పాటు అన్ని హంగులు కనిపిస్తాయి. రాజమౌళి సినిమాలో స్టార్ హీరో నటించినా.. హీరో కంటే ఎక్కువగా ఈ దిగ్గజ దర్శకుడికే పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇక ‘బాహుబలి’ సినిమాల తరువాత రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.
విదేశాల్లోనూ రాజమౌళికి ప్రత్యేకంగా అభిమానులు ఉండడం విశేషం. అయితే అమృతం సీరియల్‌తో పాపులర్ అయిన హర్షవర్ధన్‌కి సినిమాల్లో అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి. డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి నటుడై నిరూపించుకున్నా దర్శకుడు కావాలన్న ఆశ మాత్రం చావలేదు అని తెలుస్తుంది. తనలోని రైటర్‌ని కూడా నిద్ర లేపి ఇష్క్, గుండెజారి గల్లంతయ్యింది వంటి చిత్రాలకు సంభాషణలు సమకూర్చారు హర్ష.
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిన అది కుదరలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న హర్షవర్ధన్ రాజమౌళి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఏంటా అని ఆలోచిస్తున్నారా… హర్ష వర్ధన్ కి దర్శక ధీరుడు రాజమౌళి కి ఉన్న సంబంధం.
రాజమౌళి అప్పట్లో దర్శకత్వం వహించిన శాంతినివాసం అనే సీరియల్ కి హర్షవర్ధన్ రైటర్ గా పని చేశారని తాజాగా వెల్లడించారు. అలానే నా రైటింగ్ స్కిల్స్ అంటే రాజమౌళి కి ఎంతో ఇష్టం, దాదాపు 15 ఎపిసోడ్స్ కి పైగా ఆయన నాతో డైలాగ్స్ రాయించడమే కాకుండా, నాకోసం ఒక్క ప్రత్యేకమైన పాత్రని కూడా అద్భుతంగా డిసైన్ చేసారు అంటూ చెప్పుకొచ్చారు. అలా ఆ పాత్రకి నాకు ఎంతో పేరు వచ్చింది అని వారి మధ్య ఉన్న బంధం గురించి వివరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…