Categories: FeaturedMovie News

ఎర్రటి ఎండ, పక్కనే ఇసుక పాములు, షూటింగ్ లో క్రూర జంతువు నిజంగానే ‘పాపం పసివాడి’ పై దాడి..!!

మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని చూసిన అట్లూరి పూర్ణచంద్రరావుకి అలాంటి సినిమానే తీయాలనుకున్నారు. 1969లో వచ్చిన “లాస్ట్ ఇన్ ద డెసర్ట్” సౌత్ ఆఫ్రికా మూవీని చూసిన అట్లూరి పూర్ణచంద్రరావు గొల్లపూడి మారుతి రావును సంప్రదించి, మోసగాళ్లకు మోసగాడు సినిమాలో వచ్చిన ఎడారి నేపద్యం లాంటి కథను తయారు చేయమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో రచయిత గొల్లపూడి కథ, స్క్రీన్ ప్లే మాటలు సిద్ధం చేశారు. ఈ సినిమాలో ఫైట్ లు చేసే హీరో లేడు, అందమైన హీరోయిన్ అసలే లేదు, ఉల్లాస పరిచే పాటలు అసలు లేవు. అయినా పూర్ణచందర్రావు కథాబలంతో సినిమాకి భారీ బడ్జెట్ ఆరోజుల్లో పెట్టారు.

చిత్రంలో నిర్మాతగా శేషగిరిరావు పేరు కనిపించినప్పటికీ, తెరవెనక పూర్ణచందర్ రావు సినిమాకి సంబంధించిన నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాలో బాల నటుడుగా కనిపించే ‘మాస్టర్ రాము”దే ప్రధాన పాత్ర. విజయవాడకు చెందిన రాము ఆ వయసులోనే హీరోలను అనుకరించడం, డ్యాన్సులు చేయడం లాంటివి చేసేవాడు. ఆ క్రమంలో ‘పాపం పసివాడు’ చిత్రానికి ముందుగా మాస్టర్ రామును అప్రోచ్ అయినప్పటికీ వయసులో చిన్నగా ఉన్నాడని బాలనటుడిగా వద్దనుకున్నారు. కానీ తర్వాత మాస్టర్ రాము ‘పాపం పసివాడు’ చిత్రం లోని బాలనటుడిగా సరిపోతాడని తిరిగి రామును తీసుకున్నారు.

సినిమాలో ప్రధానమైన భాగం రాజస్థాన్ ఎడారిలో వచ్చే సన్నివేశాలు. దీనికోసం 33 మంది యూనిట్ సభ్యులు “పాపం పసివాడు” షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లారు. ఈ టీమ్ లో మాస్టర్ రాము మాత్రమే నటుడు, మిగతా వారంతా టెక్నీషియన్స్, దాదాపు 27 రోజుల పాటు ఎండాకాలంలో షూటింగ్ జరిపారు. ఎడారిలోని షూటింగ్ ప్రదేశానికి, టౌన్ కి దాదాపు 300 కిలోమీటర్ల దూరం. అక్కడే ఒక పల్లెటూరు దగ్గర డేరాలు వేసుకొని సినిమా షూటింగ్ చేశారు. రవాణా సౌకర్యం కోసం వాహనాలకు అవకాశం లేకపోవడంతో ఒంటెలను ఉపయోగించారు. ఉదయం 10 గంటలకే తీవ్రమైన ఎండ.. అప్పటికే షూటింగ్ పూర్తిచేసి తిరిగి సాయంత్రం 5 గంటలకు తిరిగి షూటింగ్ మొదలు పెట్టేవారు. మాస్టర్ రాము తెల్లవార్లు లేచి ఎండ వేడి తట్టుకోలేక ఏడుస్తూ ఉండేవాడు.

డేరాలో రాత్రులు కింద పడుకుంటే పాములు ఇసుకలో నుంచి వచ్చి ఎప్పుడు కరుస్తాయో అర్థం కాక పోయేది. ఒకసారి మాస్టర్ రాము కూలిన విమానంలో ఉన్నప్పుడు అతనిపై ‘హైనా’ అనే క్రూర జంతువు దాడి చేస్తుంది. నిజంగానే షూటింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా హైనా కూలిన విమానంలోకి దూరుతుంది. మాస్టర్ రాము చాకచక్యంగా అద్ధం పగులగొట్టుకుని బయటకు దూకాడు. మరొకసారి ఇసుకలో కప్పిపోయి ఉన్న మాస్టర్ రాముని హైనా రెండోసారి దాడి చేస్తుంది. ఈ సన్నివేశంలో మాస్టర్ రామును కాపాడబోయే మరో క్యారెక్టర్ టైమింగ్ లో ఆలస్యం కావడంతో హైనా రాముపై నిజంగానే దాడి చేయడానికి ప్రయత్నిస్తే.. నిర్మాత రాముని ఇసుకలోంచి బయటకి లాగడం జరిగింది.

ఇలాంటి అనేకమైన ప్రమాదాలను నిజంగానే షూటింగ్ లో ఎదుర్కొంటూ దాదాపు 27 రోజుల పాటు దినదిన గండంగా షూటింగ్ పూర్తి చేసుకుని యూనిట్ సభ్యులు తిరిగి మద్రాస్ రావడం జరిగింది. పాపం పసివాడు చిత్ర బృందం ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పట్టణాల్లో ప్రచారానికై హెలికాప్టర్ ను ఉపయోగించారు. అలా 1972లో వి.రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వచ్చే ‘అమ్మా చూడాలి..నిన్ను నాన్నను చూడాలి..’ అనే పాట ఈ చిత్రం చూస్తున్నా ప్రతి ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మాస్టర్ రాముకి ఈ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago