ఎన్టీఆర్,ఏఎన్నార్ సినీ పరిశ్రమకు రెండు కళ్ళ లాంటి వారు. సంసారం, పల్లెటూరిపిల్ల, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, మాయాబజార్ లాంటి అనేక చిత్రాల్లో నటిస్తుండగా విజయవారి సంస్థలో మరో ఓ మల్టీస్టారర్ అవకాశం రావడం జరిగింది. జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో “మణె తుంబిద హెణ్ను” చిత్రాన్ని రూపొందించారు. ఒకసారి విజయా సంస్థ అధినేత బి.నాగిరెడ్డి సహకారాన్ని విటలాచార్య పొందారు. ఆక్రమంలో బి.నాగిరెడ్డి అడగగానే ఆ కన్నడ సినిమా హక్కులను విఠలాచార్య ఇవ్వడం జరిగింది.
కన్నడ సినిమాలో ‘గుండమ్మ’ ఇతర పాత్రల్లో ఒకటిగా ఉంటుంది. కానీ ‘గుండమ్మ’ అనే పేరు మన తెలుగు ప్రాంతానిది కాదు. దర్శక, నిర్మాతలు తెలుగు ప్రాంతానికి సంబంధించిన టైటిల్ ను పెడదామనుకున్నారు. కానీ చక్రపాణి గుండమ్మ టైటిలే బాగుందని చెప్పడంతో చివరికి ఆ టైటిల్ కు అంగీకరించారు. కథ అయితే కన్నడం నుంచి తీసుకున్నారు కానీ ఆ కథని బి.నాగిరెడ్డి ముందుగా దర్శకుడు పి.పుల్లయ్యకు చదివి వినిపించారు. ఆ కథ తనకు నచ్చలేదని పి.పుల్లయ్య తిరస్కరించారు. నాగిరెడ్డి తన సోదరుడు బి.ఎన్.రెడ్డితో ఈ సినిమాను రూపొందించాలనుకున్నారు. కాని ఆయన మొత్తం కళాత్మక చిత్రాలు తీయడంతో ఇలాంటి రీమేక్ ఆయన తీస్తే బాగుండదనే ఉద్దేశంతో దర్శకుడిగా బి.యన్.రెడ్డిని తీసుకోలేదు.
ఇదే కథ తన సహ నిర్మాత, స్నేహితుడైన చక్రపాణికి అందజేయడం జరిగింది. ఆయన ఈ కథలో ఎన్నో మార్పులు చేశారు. కన్నడంలో గుండమ్మ పాత్ర మామూలుగా ఉంటుంది. కానీ చక్రపాణి ఈ సినిమాలో గుండమ్మ పాత్రనే ప్రధానంగా తీర్చిదిద్దారు. ‘విజయసంస్థ’ వారు చివరికి కమలాకర కామేశ్వరరావును దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. చక్రపాణి, కమలాకర కామేశ్వరరావు, రచయిత డి.వి.నరసరాజు కూర్చొని కథను మరింత పగడ్బందీగా రాసుకున్నారు. ఇక కన్నడ సినిమా తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడే అందులోని హీరో పాత్రలకు ఎన్టీఆర్, అక్కినేనిని తీసుకోవాలనుకున్నారు. గయ్యాలి పాత్రకు సూర్యకాంతంను ముందే తీసుకున్నారు. ఇక మిగతా తారాగణాన్ని తర్వాత ఎంపిక చేసుకున్నారు.
ఎన్టీఆర్-సావిత్రి, ఏఎన్నార్-జమునల జంట ప్రేక్షకులను అలరించింది. సినిమా మొత్తం వారి సొంత వాహినీ స్టూడియోలో రూపొందించారు. గుండమ్మ ఇంటి సెట్ మొత్తం ఆ స్టూడియోలో వేసిందే. సినిమా విడుదలకు పదిరోజుల ముందు ఎల్.వి.ప్రసాద్ ఇంట్లో పెళ్లి వేడుకల్లో గుండమ్మ కథ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇదివరకు విజయసంస్థలో పని చేసిన దర్శకుడు కె.వి.రెడ్డికి చూసి టైటిల్ కన్నడం.. కథ ఏమో కృష్ణ, గుంటూరు చుట్టుపక్కలకు సంబంధించింది.. వినడానికి సంభాషణలు బాగున్నాయి.
కానీ ఒక్క సంభాషణలతో సినిమా మొత్తం నడుస్తుందా.. పెద్ద హీరోలు, మొదటి వారం కాబట్టి సాధారణంగా హౌస్ ఫుల్ అవుతుందని కేవీ.రెడ్డి వ్యాఖ్యానించడంతో దర్శకనిర్మాతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కానీ ఒక్క చక్రపాణి మాత్రమే సినిమా పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారు. 1962 జూన్ 7న “గుండమ్మకథ” చిత్రం ఆంధ్రదేశమంతటా విడుదల అయింది. విమర్శకుల అంచనాలను తిరగరాస్తూ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. సినిమా అలా నడుస్తున్నా కూడా కె.వి.రెడ్డి తన విమర్శను ఎప్పుడూ సమర్ధించుకుంటూ.. ఏంటోనండి జనాలు ఈ సినిమా ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు అని తరుచూ అంటూఉండేవారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…