Roja – Selvamani: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఈ కార్యక్రమంలో కమెడియన్స్ లో కలిసి వారిపై పంచులు వేయడం లేదా పలు స్కిట్ లలో కమెడియన్ రోజా పై సెటైర్లు వేయడం మనం చూస్తూ ఉంటాము.
అయితే వీటన్నింటిని ఎంతో సరదాగా తీసుకునే రోజా గురించి తాజాగా జబర్దస్త్ కార్యక్రమంలో మరొక స్కిట్ వేశారు.వచ్చేవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ రోజా ఇంటికి వెళ్లి ఆమె ఇంటిని చూడాలని వెళ్తారు.
అంతలోగా అక్కడికి రోజా రావడంతో వారిద్దరూ దాక్కుంటారు. రోజా గెటప్ లో ఉన్న పార్వతి వస్తూనే అబ్బాయిలకు అన్యాయం జరిగితే అరగంట ఆలస్యం అవుతుందేమో కానీ అమ్మాయిలకు అన్యాయం జరిగితే అర నిమిషం కూడా ఆలస్యం చేయను అనే డైలాగ్ తో ఎంట్రీ ఇస్తుంది. ఇక ఇది చూసిన రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది.
అంతలోనే నూకరాజు రోజా భర్త, డైరెక్టర్ సెల్వమణి పాత్రలో నటించారు. నా నోరు లాగుతుంది. రోజా అందంగా ఉంది అని అని..నేనే సెల్వమణి అని పంచ్ వేశాడు. ఇది చూసిన రోజా ఎంతో ఆశ్చర్యపోతూ బాగా ఎంజాయ్ చేశారు. ఇక నూకరాజు పై ప్రశంసలు కురిపించడమేకాకుండా ఆ డైలాగులు పేపర్ పై రాసి ఇవ్వాలని ఇంటికి వెళ్లి తన భర్తతో ఆ డైలాగులు చెప్పిస్తానని రోజా నూకరాజును అడిగారు. తన భర్త గురించి రోజా మాట్లాడుతూ నూకరాజు చేసిన స్కిట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సెల్వరాజ్ రేసుగుర్రంలో శృతి హాసన్ లాంటి వాడని అన్ని మనస్సులోనే అనుకుంటాడు బయటికి ఏది చెప్పాడు అంటూ తన భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. రోజా ఇలా చెప్పడంతో అనసూయ అయ్యో అంటూ నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…