ఒకప్పుడు పలు సినిమాలలో హీరోయిన్ గా కొనసాగిన వారు తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై కొనసాగిస్తున్నారు. ఈక్రమంలోనే అన్నమయ్య చిత్రంలో నటించి అందరిని మెప్పించిన నటి కస్తూరి ప్రస్తుతం బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇలా సినిమాలలోను సీరియల్స్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కస్తూరి తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని తన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.తన జీవితంలో తాను చావును మూడుసార్లు దగ్గరగా చూశానని రెండు సార్లు తన తల్లిదండ్రుల రూపంలో వస్తే ఒకసారి తన కూతురి రూపంలో చావు చూశానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
తన కూతురు లుకేమియా వ్యాధితో బాధ పడిందని.ఏకంగా మూడు సంవత్సరాల పాటు మంచానికే పరిమితమైన తన కూతురిని చూస్తూ ఎంతో నరకం అనుభవించానని ఎంతో ధైర్యంతో ముందుకు వెళుతూ తన కూతురిని ఆ నరకం నుండి రక్షించుకున్నానని తెలిపారు.
తన కూతురుకు అనారోగ్యం చేసిన సమయంలోనే తనకు బాబు కూడా పుట్టాడని ఆ మూడు సంవత్సరాలు బాబుకు దూరంగా ఉంటూ ఎంతో బాధను భరించానని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం తన కూతురు కొడుకు ఇద్దరూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇక ఈమె స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…