Featured

ఈ రెండు సినిమాలలో ఒకటి ఇండస్ట్రీహిట్ అనడంతో… వివాదానికి దారి తీసింది.!!

1980 దశకం ప్రారంభంలో.. స్టార్ హీరోలు తమ చిత్రాలతో విజయ దుందుభి మోగించారు. ఎన్టీరామారావు, ఏఎన్నార్, కృష్ణంరాజు, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి లాంటి హీరోల చిత్రాలను జనాలు నీరాజనాలు పలికారు.

1981లో విడుదలైన ఇద్దరు సీనియర్ హీరోల చిత్రాలు కొంత అలజడిని రేకెత్తించాయి. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ తో ఒక సినిమా రూపొందించగా.. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఏఎన్నార్ తో ఒక చిత్రం రూపొందించబడింది. ఈ రెండు చిత్రాల విషయంలో ఏది ఇండస్ట్రీ హిట్ అనే సందిగ్ధంలో కొంత అభిమానుల మధ్య వివాదం చోటుచేసుకుంది.

1981 ఫిబ్రవరి, అన్నపూర్ణ బ్యానర్,దాసరి నారాయణరావు దర్శకత్వంలో ప్రేమాభిషేకం చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో ఏఎన్నారు, శ్రీదేవి, జయసుధ హీరో, హీరోయిన్లుగా నటించారు. దాసరి, ఏఎన్ఆర్ కాంబోలో ఇది నాలుగో చిత్రం కాగా అన్నపూర్ణ బ్యానర్ లో ఇది మూడవ చిత్రం. లోగడ కళ్యాణి, బుచ్చిబాబు చిత్రాలు విజయవంతం కాగా… 1980 శ్రీవారి ముచ్చట్లు సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుండగా… దేవదాసు సినిమా కథను పోలి ఉన్న ఒక స్టోరీ లైన్ ని అక్కినేనికి చెప్పడంతో అది నచ్చి తమ సొంత బ్యానర్ లోనే సినిమా తీద్దామని దాసరితో ఆయన చెప్పారు. అలా ముక్కోణపు ప్రేమకథా చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు.

పదహారేళ్ళవయసు, వేటగాడు, ఆటగాడు లాంటి చిత్రాలతో మంచి ఫామ్ లో ఉన్న శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో ఉన్న వేశ్య పాత్రకు ముందుగా లక్ష్మిని అనుకున్నప్పటికీ ఎందుకో ఆమె స్థానంలో జయసుధను తీసుకున్నారు. ప్రేమాభిషేకం చిత్రం తర్వాత అనేక ప్రేమకథా చిత్రాలకు ఈ సినిమా ఒక ప్రేరణ గా చెప్పవచ్చు…

అడవి రాముడు చిత్రంతో ప్రారంభమైన రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్ కాంబో.. ఆ తర్వాత వేటగాడు, డ్రైవర్ రాముడు, కేడి నెంబర్1, గజదొంగ.. లాంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకువెళ్తున్న ఈ కాంబినేషన్ లో మరొక చిత్రం అనగానే అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. అర్జున్ రాజు, శివరామరాజు ఎన్టీఆర్ తో ఒక సినిమా రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో ఆయన డేట్స్ ఇవ్వడంతో సత్యానంద్ ఒక కథ తయారు చేయమని చెప్పారు.

తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా “తంగపథక” చిత్రం తెలుగులోకి ‘బంగారు పతకం’ డబ్ కాబడింది. ఆ సినిమాలోని‌‌ మూలకథను తీసుకొని పోలీస్ బ్యాక్ డ్రాప్ లో… రచయిత సత్యానంద్ ఒక సెంటిమెంటు కథను తయారు చేశారు. అది ఎన్టీ రామారావుకు నచ్చడంతో.. ఎన్టీఆర్, శ్రీదేవి కాంబోలో వచ్చిన అన్ని చిత్రాలు హిట్ కావడంతో తిరిగి “కొండవీటి సింహం” చిత్రంలో కూడా హీరోయిన్ గా శ్రీదేవిని తీసుకున్నారు. చక్రవర్తి స్వరపరిచిన గీతాలు ‘అత్తమడుగు వాగులోనా అత్త కూతురో.. ‘బంగినపల్లి మామిడి పండి రంగు మీదుంది.. ఇలాంటి పాటలు ఆనాటి అభిమానులను కిర్రెక్కించాయి.

1981, అక్టోబర్ లో విడుదలైన కొండవీటి సింహం, ప్రేమాభిషేకం చిత్రాలలో ఏది ఇండస్ట్రీహిట్ అనే విషయంలో రెండు చిత్రాల మధ్య కొంత వివాదం రాజుకుంది. ప్రేమాభిషేకం తెలుగు సినీ చరిత్రలో మొదటి ప్లాటినం జూబ్లీ జరుపుకున్న చిత్రం. 30 కేంద్రాల్లో డైరెక్ట్ గా వంద రోజులు, 20 కేంద్రాల్లో 200 రోజులు, 11కేంద్రాలలో 300 రోజులు, 8 కేంద్రాలలో సంవత్సరం పాటు ఆడిన చిత్రమని ఏఎన్ఆర్ అభిమానులు లెక్కలతో సహా నిరూపించడంతో… 1981 సంవత్సరానికి ‘ప్రేమాభిషేకం’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలువుగా.. ఆ సినిమాకి సమీపంలో ‘కొండవీటిసింహం’ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

8 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago