AaNaluguru Movie :కొన్ని సినిమాలు చూస్తుంటే మనమంత సినిమాలోని పాత్రలచే కలిసి ప్రయాణిస్తూంటాం. అందులో వచ్చే కొన్ని సీన్లు జీవితంలో మన చుట్టూ జరిగే సంఘటనలను గుర్తుచేస్తుంటాయి. పాత్రలకు వచ్చే బాధ ఆనందం ఏవైనా కావచ్చు కుర్చీలో కూర్చున్న మనమంతా కూడా వాటిని అనుభవిస్తుంటాం. కొన్ని సినిమాలు అసహజంగా నిజ జీవితానికి ఆమడ దూరంలో ఉంటే కొన్ని సినిమాలు సహజత్వం తో ప్రేక్షకులందరినీ అందులో ఇన్వాల్వ్ చేస్తుంటాయి.
కథా రచయిత మదన్ చిత్తూరు జిల్లా మదనపల్లెలో చదువుకునే రోజుల్లో అక్కడికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఓ వ్యక్తి ఊరంతా అప్పులు చేసి మరణించాడు. కానీ అంతిమయాత్రకు ఊరు ఊరంతా కదలి వచ్ఛారు. దీనిచే ప్రేరణ పొందిన మదన్ మదిలో మెదిలిన కథ అంతిమయాత్ర. ముందుగా ఈ కథతో సీరియల్ తీద్దామని కొన్ని ఎపిసోడ్స్ రాసుకున్నారు. కానీ ఎందుకనో వర్కవుట్ కాలేదు. ఆ కథను ప్రముఖ నటుడు రచయిత భాగ్యరాజా గారికి వినిపించారు. ఆ కథలోని రఘురాం పాత్రను నేనే చేస్తానంటూ కథ తనకు కావాలని భాగ్యరాజా అడిగాడు. అందుకు మదన్ టీం నిరాకరించింది.
ఎట్టకేలకు చిట్టచివరికి ఆ నలుగురు సినిమా చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కింది. అంతిమయాత్ర కాస్త ఆ నలుగురు గా మార్చారు. ఈ సినిమాలో రఘురాం అనే ముఖ్య పాత్ర కోసం దాసరి, మోహన్ బాబు, ప్రకాష్ రాజు లను సంప్రదించారు. చివరికి రాజేంద్ర ప్రసాద్ ను తీసుకున్నారు.రాజేంద్రప్రసాద్ కు జోడీగా లక్ష్మి, భానుప్రియ, గౌతమి, రోజా అనుకున్నారు. కానీ చివరికి ప్రముఖ హీరోయిన్ ఆమని గారిని సెలెక్ట్ చేశారు.
2004లో విడుదలైన ఆ నలుగురు సినిమా పోస్టర్ చాలా డల్ గా ఉంది.స్టార్ హీరోలు ఎవరు కూడా కనిపించడం లేదు. వయసుమళ్ళిన పాత్ర లో రాజేంద్రప్రసాద్ కనబడుతున్నారు. ఇంకేముంది థియేటర్ కి వెళ్లి చూస్తే నలుగురు మాత్రమే ఉన్నారు. దర్శక నిర్మాతలు నిరాశ చెందారు. అలా రెండు వారాలు గడిచిన తర్వాత మూవి బాగుందనడంతో సినిమా హాల్ కు ఒక్కొక్కరుగా రావడం మొదలు పెట్టారు. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమాకి కాసుల వర్షం కురిసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…
ధ్యానం, భక్తి, ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడితే కొన్ని విశేష సంఘటనలు తరచూ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా గజ్జెల చప్పుళ్లు వినిపించడం…