NTR : సినీ కళామతల్లి ఎక్కడో పుట్టిన ఎందరో కళాకారుల్ని తన కడుపులో పెట్టుకొని చూసుకునే బంగారుతల్లి ఆ తల్లి నీడలో పెరిగి అందనంత ఆకాశానికి ఎదిగి, పేరు ప్రతిష్టలతో తరగని ఖ్యాతితో, విరగని కీర్తితో అభిమానుల గుండెల్లో అజరామరంగా నిలిచిపోయిన సినీ కళాకారులు చరిత్ర పుటల్లోకి ఎక్కారు. విధి ఆడే వింత నాటకంలో పావులుగా మారే వారు కొందరైతే,ఆర్థిక సుడిగుండాల తో నిత్య పోరాటం చేసేవారు మరికొందరు.
నాటి మిస్సమ్మ, గుండమ్మ, కథ మాయాబజార్, శ్రీ కృష్ణ అర్జున యుద్ధం, సత్యం శివం, చాణక్య చంద్రగుప్త మొదలగు సినిమాలలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎలాంటి భేషజం లేకుండా నటించారు. ఆ తర్వాత పద్మాలయ సంస్థలో తనకు నటించాలని ఉందని ఎన్టీఆర్ అడిగినప్పుడు ఎన్టీఆర్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన దేవుడు చేసిన మనుషులు చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతి తరం వారు కూడా ఇలాంటి మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తి చూపారు.
కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి లాంటి విజయవంతమైన సినిమాల తర్వాత ఎన్టీ రామారావు రాజకీయరంగంలోకి అడుగుపెట్టారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అలా ఒకసారి పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత తిరిగి 1989లో ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ పై కొన్ని వ్యంగ్య చిత్రాలు విడుదలయ్యాయి.
అలా విడుదలైన గండిపేట రహస్యం, రాజకీయ చదరంగం, మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి రిక్షావాలా… ఈ సినిమాల అనంతరం దర్శకురాలు విజయనిర్మల ఓ ఫంక్షన్ లో కనబడితే అందరి ముందు ఏవమ్మా నా మీద తీయడానికి ఇంకేమైనా మిగిలి ఉందా… ఇంతేనా అని ఎన్టీఆర్ నవ్వుతు అడిగారట..పెద్దాయన సరదాగా తీసుకున్నారేగాని ఏనాడు అంతా సీరియస్ గా తీసుకోలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…