Movie News

Senior Actress Varalaxmi : ఈ నటిని ఫైట్ మాస్టర్ కావాలనే 24 మెట్లపై నుంచి కిందికి తోసేశారు… ఆ తరవాత..!!

Senior Actress Varalaxmi : బేబీ వరలక్ష్మి, కుమారి వరలక్ష్మి, సిస్టర్ వరలక్ష్మి, శ్రీమతి వరలక్ష్మి ఇలా వయసు రీత్యా అనేక రకాల పేర్లతో పిలువబడుతున్న నటి వరలక్ష్మి తన కెరీర్ ను బేబీ పాత్రలతో మొదలు పెట్టి ఇప్పుడు శ్రీమతి పాత్రలను వేస్తున్న ఆమె సిస్టర్ క్యారెక్టర్ లో తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో వేయడంతో ఆమె సిస్టర్ వరలక్ష్మి గానే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యింది.
మనం ఎప్పుడైనా హీరో హీరోయిన్ల డేట్స్ ఖాళీగా లేవని వింటుంటాం. ఆనాడు సిస్టర్ క్యారెక్టర్ వేసే వరలక్ష్మి డేట్స్ ఖాళీగా ఉండేవి కావు. ఎందుకంటే హీరోయిన్స్ గా వేసేవారు చాలామంది ఉన్నారు. కానీ సిస్టర్ క్యారెక్టర్ వేసే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో వరలక్ష్మికి అంతగా ఇష్టం లేకపోయినా చెల్లెలు పాత్ర ని చేయించేవారు.

ఎస్వీరంగారావు, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు, శోభన్ బాబు లాంటి హీరోల సినిమాల్లో వరలక్ష్మి బేబీ పాత్రను వేసింది. ఆ తర్వాత అదే హీరోల ప్రక్కన చెల్లెలు పాత్రలోకనిపించింది. 12 సంవత్సరాలు వచ్చే వరకు బేబీ పాత్రలో కనిపించిన వరలక్ష్మికి ఒక్కసారిగా బేబీ పాత్రలు ఆగిపోయాయి. ఇక వరలక్ష్మి వాళ్ళ నాన్నగారు బేబీ పాత్రలు రాకపోవడంతో ఆమెను హీరోయిన్చేద్దామనుకున్నారు. ఆయన దర్శక నిర్మాతల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 12 సంవత్సరాల అమ్మాయి హీరోయిన్ గా చేయడం బాగుండదని చెప్పడంతో చేసేది ఏమీలేక వరలక్ష్మి నాన్నగారు ఇంటికి తిరుగు ముఖం పట్టారు. ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉండగానే అదే వయసులోనే వరలక్ష్మికి చెల్లెలి పాత్రలు రావడం మొదలు పెట్టాయి.ఇక దాదాపుగా అనేక భాషల్లో చెల్లెలి పాత్రలో కనిపించింది.

‌‌ఓ ఫైట్ మాస్టర్ తనను గత కొద్ది కాలంగా కార్నర్ చేస్తున్నాడని వరలక్ష్మి తన తండ్రి గారికి చెప్పినప్పుడు.. మంచి పెర్ఫామెన్స్ కొరకు కష్టపెడుతుంటారు. నువ్వు అలాంటివి పట్టించుకోకు అని చెప్పడంతో వరలక్ష్మి సర్దుకు పోయింది.

ఒకసారి అశ్వద్ధామ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా దర్శకుడు కేవలం రెండు మెట్ల నుంచి వరలక్ష్మి ని కిందికి లాగమని చెప్పగా.. ఫైట్ మాస్టర్ అందుకు విరుద్ధంగా 24 మెట్ల నుంచి కిందికి లాగాడు. అలా కింద పడిన వరలక్ష్మి నడుముకి తీవ్రమైన దెబ్బ తగిలింది అప్పుడు ఆమె బాధను భరించలేక ఒక్కసారిగా స్టూడియో మొత్తం దద్దరిల్లేలా కేక పెట్టింది… చిన్న గొడవ లాగా జరిగిన ఫైట్ మాస్టర్ వరలక్ష్మికి సారీ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago