Featured

మహేష్ బాబుతో మొదటి సినిమా చేసిన హీరోయిన్‌కి బ్యాడ్ లక్ వెంటాడుతుందా..?

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి బాల నటుడుగా ఎంట్రీ ఇచ్చి దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన రాజకుమారుడు ద్వారా హీరోగా మారి ప్రస్తుతం సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు మహేష్ బాబు. కథలు ఎంచుకోవడంలో..  దర్శక, నిర్మాతల పట్ల తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్ పేరు తెచ్చుకున్నాడు. సినిమా, ఫ్యామిలీ, సమాజ సేవ.. ఇలా మూడు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నాడు మహేష్. ఎక్కువగా సక్సెస్ లలో ఉన్న దర్శకులతోనే పని చేస్తాడు.. వారికే అవకాశాలిస్తాడని మహేష్ బాబు మీద కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వరుస హిట్స్ తో మంచి ఫాం లో ఉన్నాడు.

ఇక తండ్రి మాదిరిగానే ఇండస్ట్రీకి తన సినిమాల ద్వారా కొత్త హీరోయిన్స్ ని కూడా పరిచయం చేశాడు. అయితే మహేష్ బాబుతో మొదటి సినిమా చేసి ఇండస్ట్రీకి పరిచయమైన చాలా మందికి ఇండస్ట్రీలో హీరోయిన్ గా లైఫ్ ఉండదనే కొన్ని మాటలు బాగా వినిపించాయి. ఆ మాటలను బట్టి చూస్తే నిజంగానే మహేష్ బాబుతో మొదటి సినిమా చేసిన కొంతమంది హీరోయిన్స్ మళ్ళీ టాలీవుడ్ లో కనిపించకుండా పోయారు.

మహేష్ బాబు నటించిన అతిథి సినిమా ద్వారా అమృతారావు టాలీవుడ్ కి పరిచయం అయింది. ఈ సినిమా 2007లో వచ్చి ఫ్లాప్ సినిమాగా మిగిలింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమృతా రావు బాగానే నటించింది. కానీ ఆమెకి ఇదే తెలుగులో మొదటి మరియు చివరి సినిమా. బాలీవుడ్‌లో వివాహ్ అనే సినిమా చేసి బాగా క్రేజ్ రావడంతో మహేష్ బాబు అవకాశం ఇచ్చాడు. కానీ మళ్ళీ తెలుగులో కనిపించలేదు.

ఇక జయంత్ సి పరాన్‌జి దర్శకత్వంలో నటించి కౌ బాయ్ సినిమా టక్కరి దొంగ. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక దీని ద్వారా బిపాస బసు, లిసారే హీరోయిన్స్‌గా పరిచయం అయ్యారు. కానీ తెలుగులో వీరికి రెండవ సినిమా లేకుండా పోయింది. అయితే బిపాస బసు బాలీవుడ్ ల మాత్రం స్టార్ హీరోయిన్ గా వెలిగింది.

ఇక మహేష్ సతీమణి నమ్రత కూడా 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమా ద్వారా పరిచయం అయింది. కానీ మెగాస్టార్ తో అంజి తప్ప మళ్ళీ సినిమాలు చేయలేదు. అయితే మహేష్ ని పెళ్ళి చేసుకున్నాకే ఈమె సినిమాలకి దూరమయ్యారు.

ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 1 నేనొక్కడినే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. ఈమెకి ఈ సినిమానే తెలుగులో మొదటి సినిమా. ఈ సినిమా కూడా ఫ్లాప్ సినిమానే. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య సరసన దోచేయ్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ఇలా మహేష్ తో తెలుగులో డెబ్యూ సినిమా చేసిన కొందరు హీరోయిన్స్ టాలీవుడ్ లో సత్తా చాటలేకపోయరు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి మొదటి సినిమాతో భారీ హిట్ అందుకున్న కియారా అద్వానీ .. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ సరసన వినయ విధేయ రామ చేసింది. ఈ సినిమా ఫ్లాపవడంతో మళ్ళీ టాలీవుడ్ లో నటించలేదు. కానీ ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. కాగా ఇటీవల శంకర్ – చరణ్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. దీనిబట్టి చూస్తే మహేష్ తో మొదటి సినిమా చేసిన హీరోయిన్ టాలీవుడ్ లో రాణించింది లేదనే చెప్పాలి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago