యాంకర్ గా శ్రీముఖి అతి తక్కువ కాలంలో ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ కనపడుతూ.. తమ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. అంతే కాకుండా తన యూట్యూబ్ చానల్ లో ప్రతీ రోజు ఎదో ఒక వీడియో అప్ లోడ్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది.
అయితే శ్రీముఖి ఓ వైపు టీవీ యాంకర్‌గానూ.. మరోవైపు సినీ నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు.
ముఖ్యంగా ఆమెకు పటాస్ షో ద్వారా ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. యాంకరింగ్ లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి.. అటు సినిమాల్లోనూ చిన్నా చితక పాత్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆమె ప్రధాన పాత్రలో ఓ సినిమాలో నటించారు. దాని పేరు క్రేజీ అంకుల్స్. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్నిగ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్, గుడ్ సినిమా గ్రూప్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవల ఈ సనిమా ట్రైలర్ విడుదలయ్యింది. దీంతో క్రేజీ అంకుల్స్ పై ప్రతీ ఒక్కరికీ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా టైటిల్ లిరికల్ సాంగ్‌ని ఇంతకు ముందు దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. రఘు కుంచే సంగీతం అందించగా లిప్సిక గానం చేసిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంది.
ఈ పాట ఇప్పటికే 50 లక్షల వ్యూస్ తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాను మేలో విడుదల చేద్దాం అనుకున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆగస్టు 19న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు నిర్మాత శ్రేయాస్ శ్రీను చెప్పారు. అయితే దీనికి సంబంధించి విడుదల తేదీని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…