సామాజిక అంశాలకి పక్కా కమర్షియల్ అంశాలను జోడించి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాలు తీస్తూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఆయన మేకింగ్ స్టైల్ కాస్త అటు ఇటుగా ఆయన గురువు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మలాగా ఉంటుందని కొన్ని సినిమాలలో అనిపిస్తుంది. కానీ సినిమా మీద పూర్తిగా మాత్రం తన మార్క్ ఉండేలా తన క్రియేటివిటీని చూపిస్తుండటం గొప్ప విషయం.
కృష్ణవంశీ కొత్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. హీరో కోసం కథ రాయని దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా వాళ్ల ఇమేజ్‌కి తగ్గట్టు సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. గులాబి, అంతపురం, మురారి, ఖడ్గం లాంటి ఇండస్ట్రీ హిట్స్ కృష్ణవంశీ ఖాతాలో ఉన్నాయంటే ఆయన సినిమా సినిమాకి ఎంత వెరియేషన్ చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు.
కృష్ణవంశీ కెరీర్ ప్రారంభంలోనే కింగ్ నాగార్జునతో నిన్నే పెళ్ళాడతా తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. గులాబి సినిమాలో ఆయన తీసిన పాటలు చూసిన నాగార్జున ఈ అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. అందుకే నాగార్జున మళ్ళీ కృష్ణవంశీకి చంద్రలేఖ సినిమా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో సాంగ్స్ హిట్ అయినప్పటికీ సినిమా మాత్రం ఫ్లాప్‌గా మిగిలింది. ఆయన తీసిన సముద్రం సినిమా మేకింగ్ పరంగా ఆయనకి చాలా మంచి పేరు తీసుకువచ్చింది. ఇక అంతఃపురం కృష్ణవంశీ కెరీర్ లో మైల్ స్టోన్ లా ఎప్పటికీ నిలిచే సినిమా. దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం అందుకున్నారు.
ఇదే క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మురారి సినిమా తీసి భారీ హిట్ అందుకున్నాడు. ఒక సాంగ్ విషయంలో ఏకంగా కృష్ణ గారితోనే వాదనకి దిగిన సందర్భం ఉంది. ఇలాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు నితిన్ – అర్జున్ లాంటి స్టార్స్‌తో శ్రీ ఆంజనేయం తీస్తున్నాడంటే అందరిలో ఉండే అంచనాలు అసాధారణం. భక్తి ప్రధానమైన సినిమాతో కృష్ణవంశీ మాయ చేయడం ఖాయమని భారీ అంచనాలు పెట్టుకుంటారు. అసలు టైటిల్ చూసి ప్రేక్షకులు ఊహించుకునేదే వేరు. కానీ ఇందులో హీరోయిన్‌గా నటించిన ఛార్మీ శృతి మించిన శృంగార సన్నివేశాలు ఎబ్బెట్టుగా అనిపించాయి.
శ్రీ ఆంజనేయం అనే టైటిల్ పెట్టి ఓ బూతు సినిమా తీశాడంటూ కృష్ణవంశీని కామెంట్ చేశారు. అసలు కథలో ఛార్మీ అవసరం ఏంటీ అంటూ ప్రశ్నించిన వాళ్ళూ ఉన్నారు. రొమాంటిక్ సాంగ్.. ఆంజనేయ స్వామీ భక్తుడిగా నటించిన నితిన్‌ని టెంప్ట్ చేసే సీన్స్ చూసి అభిమానులు, ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అప్పట్లో వరుసగా కృష్ణవంశీ ఛార్మీతో మూడు సినిమాలు చేశాడు. దాంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ గుస గుసలు వినిపించాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…