ఓ వ్యక్తి నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో కొట్టుకుపోయాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడి మృతదేహాన్ని గ్రామస్తుల సహాయంతో పోలీసులు వెలికి తీయించారు. కానీ ఆ గ్రామస్తుల నమ్మకం ప్రకారం ఆ మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి 30 నిమిషాల పాటు అటూ.. ఇటూ ఊపారు. గ్రామస్తులు ఇలా చేస్తుండగా అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘటనను పోలీసులు కూడా వీడియోలు, ఫొటోలు తీయడం విశేషం.
ఈ ఘటనలో గ్రామస్తులు ఎందుకు అలా చేశారు.. చివరకు ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో కుంభ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోగీపురా గ్రామానికి చెందిన భన్వర్ లాల్ అనే వ్యక్తి నదిలో స్నానం చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో కొట్టుకుపోయాడు. ఈ దృశ్యాలు చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు.
అప్పటికే అతడు మృతిచెందాడు. అయితే గ్రామస్తులు ఆ మృతదేహాన్ని తీసుకొని చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. దీనికి కారణం ఏంటంటే.. ఇలా చేస్తే నీరు బయటకు వచ్చి బతుకుతాడనే నమ్మకం ఉందంటూ.. గ్రామస్తులు తెలిపారు. అందుకే పోలీసులు కూడా ఏమనలేక వదిలేశారు. ఇలా దాదాపు 30 నిమిషాల పాటు చేశారు.
అయినా ఉపయోగం లేకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా పోలీసు ఉన్నతాధికారులు వరకు ఈ విషయం వెళ్లింది. దీంతో అక్కడ కోవిడ్ నిబంధనలు పాటించని వారందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ సిద్దమైంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…