80’హీరోల్లో ఆ నలుగురు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ప్రధానమైన వారుగా చెప్పుకోవచ్చు. 1980 దశకంలో ఆ నలుగురు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి తమను తాము నిరూపించుకున్నారు.
అలాంటి ఈ సినీ పరంపరలో సాంఘిక, పౌరాణిక చిత్రాల్లో నటిస్తూ తమ అభిమానులనే కాకుండా ప్రేక్షకులను సైతం ఎంతగానో అలరించారు. ఈ హీరోలు డాక్టర్, పోలీస్ ఆఫీసర్ లాంటి పాత్రలలో నటించిన చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ క్రమంలో ఈ నలుగురు వకీల్ సాబ్ గా కూడా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.
1983, క్రియేటివ్ కమర్షియల్స్, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “అభిలాష” చిత్రం విడుదలైంది. ఇందులో చిరంజీవి, రాధిక హీరో, హీరోయిన్లుగా నటించారు. రావుగోపాల్ రావు ఒక పేరు మోసిన “వకీల్ సాబ్”గా కనిపించారు. చిరంజీవి (వకీల్ సాబ్)తన తండ్రికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని ఐపిసీ 302 రద్దు చేయాలనే కథాంశంతో అభిలాష సినిమా తెరకెక్కింది.
1992, శ్రీ రాజీవ్ ప్రొడక్షన్స్, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “ధర్మక్షేత్రం” విడుదలయింది. ఈ చిత్రంలో బాలకృష్ణ, దివ్యభారతి హీరో, హీరోయిన్లుగా నటించారు. బాలకృష్ణ ఈ సినిమాలో వకీల్ సాబ్ గా కనిపించారు. సమాజంలో జరిగే అన్యాయాలను వకీల్ సాబ్ గా ఇండియన్ పీనల్ కోడ్ లను ఉపయోగిస్తూ అక్రమాలను అరికడుతుంటాడు.
1996, సురేష్ ప్రొడక్షన్స్,సురేష్ కృష్ణ దర్శకత్వంలో “ధర్మ చక్రం” చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో వెంకటేష్, ప్రేమ హీరో, హీరోయిన్లుగా నటించారు. వెంకటేష్ తను ప్రేమించిన అమ్మాయి చావుకు కారణం తన తండ్రి అని తెలియడంతో అతని పై న్యాయ పోరాటానికి వకీల్ సాబ్ గా వెంకటేష్ రంగంలోకి దిగుతాడు.
2001, లక్ష్మీప్రసన్న పిక్చర్స్, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో అధిపతి చిత్రం విడుదలయింది. ఇందులో మోహన్ బాబు, ప్రీతి జింగానియా, నాగార్జున సౌందర్య హీరో, హీరోయిన్లుగా నటించారు. ఒక విధంగా చెప్పాలంటే.. ఈ సినిమాలో నాగార్జున సౌందర్యలది గెస్ట్ అప్పియరెన్స్ అని చెప్పవచ్చు. మోహన్ బాబు తరపున కోర్టులో కేసు వాదించే “వకీల్ సాబ్”గా నాగార్జున నటించారు. ఇలా ఆ నలుగురు వకీల్ సాబ్ లుగా నటించి ప్రేక్షకులను ఆరోజుల్లో రంజింపజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…