Featured

మిమిక్రీ ఆర్టిస్టు గా పనిచేస్తున్న వేణుమాధవ్ కు ఎన్టీఆర్ టీడీపీ ఆఫీసులో ఇచ్చిన జీతం ఎందుకు నచ్చలేదు..?

మిమిక్రీ ఆర్టిస్ట్ గా పేరు పొంది నటుడిగా మారిన అతికొద్ది మందిలో కమెడియన్ వేణుమాధవ్ ఒకరు.ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో, విచిత్రమైన ఊత పదాలతో అద్భుతమైన కామెడీ చేసే వేణుమాధవ్ కొన్ని అనారోగ్య సమస్యల వలన చనిపోయారనేది తెలుగు ప్రజలు జీర్ణించుకోలేని విషయం. 1994లో నల్గొండ కోదాడ పరిధిలో మిమిక్రీ చేస్తున్న తరుణంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చూసి భువనగిరిలో మంత్రి ఎలిమినేటి మాధవ రెడ్డి సభలో మిమిక్రీ చేయించడం జరిగింది. ఆ సభకు హాజరైన నారా చంద్రబాబు నాయుడు వేణుమాధవ్ మిమిక్రీ చూసి ఆయనను అభినందించారు.

ఆ తర్వాత కొద్ది రోజులకు తెలుగుదేశం మహానాడు జరుగుతుండడంతో ఆ కార్యక్రమంలో వేణుమాధవ్ మిమిక్రీ చేయడానికి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. అక్కడ ఎన్టీ రామారావు కూడా చూసీ హర్షం వ్యక్తం చేశారు. అలా అన్నగారి సూచన మేరకు హైదరాబాదులో టీడీపీ ఆఫీసులో టెలిఫోన్ ఆపరేటర్ గా వేణుమాధవ్ పనికి కుదిరారు. టిడిపి ఆఫీసులో ముఖ్యంగా ఎన్టీరామారావు దగ్గర పని చేయడం అంటే చాలా జీతం ఉంటుందని వేణుమాధవ్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అలా నెల రోజులు గడిచాక 600రూ.లు జీతం ఇవ్వడంతో వేణుమాధవ్ ఆశ్చర్యపోయాడు. తనకు ఈ డబ్బులు చాలవని మిమిక్రీ ఆర్టిస్ట్ గా కొనసాగుతానని సెల్ ఫోన్లు అప్పుడు అందుబాటులో లేకపోవడంతో టిడిపి ఆఫీస్ నెంబర్ తో విజిటింగ్ కార్డు కొట్టించి, వాటిని తెలిసిన వాళ్ళకి పంచడం జరిగింది. అలా టిడిపి ఆఫీస్ కి రెండు కాల్స్ వస్తే వేణు మాధవ్ కోసం 18 కాల్స్ వచ్చేవి. ఇది కాస్త నారా చంద్రబాబు నాయుడు దృష్టి కి వెళ్ళింది. అప్పుడు వేణుమాధవ్ ను అక్కడి నుండి మరో చోటుకు పంపించడం జరిగింది. ఇలా వేణుమాధవ్ మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేస్తుండగా.. ఒకరోజు దర్శకుడు ఎస్వీ.కృష్ణారెడ్డి వేణు మాధవ్ ని చూశారు.

అతని పర్ఫార్మెన్స్ నచ్చడంతో కృష్ణ తో తీయబోయే సంప్రదాయం సినిమాలో నటిస్తావా ? అని వేణుమాధవుని ఎస్వీ కృష్ణారెడ్డి అడిగారు. సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోవడంతో.. ఒకవేళ నటించాల్సి వస్తే తనకు 70 వేల రూపాయలు ఇవ్వాలని… వేణుమాధవ్ ఎస్.వి.కృష్ణారెడ్డి ని డిమాండ్ చేయడం జరిగింది. అలా వేణుమాధవ్ సాంప్రదాయం సినిమాలో మొదటగా నటించడం జరిగింది. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, మాస్టర్, ప్రేమించుకుందాం రా, తొలిప్రేమ, యువరాజు, ప్రియమైన నీకు, ఆది, దిల్, సింహాద్రి, జై చిరంజీవ, ఆంధ్రావాలా, వెంకీ, యోగి, లక్ష్మి, చత్రపతి, కృష్ణ, పోకిరి, ప్రేమాభిషేకం, హంగామా ఇలాంటి చిత్రాల్లో వేణుమాధవ్ నటించారు.

అయితే వేణు మాధవ్ చనిపోయే ముందు ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని… తనకు వ్యవసాయం అంటే ఇష్టమని తన పది ఎకరాల లో పండిన పంటలో ఓ బస్తా బియ్యం తనకు ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ కి ప్రతి సంవత్సరం పంపిస్తానని అలాగే పవన్ కళ్యాణ్ కూడా తనకు పండిన పంటలో ఒక బస్తా మామిడి పళ్ళు పంపిస్తాడని చెప్పుకొచ్చారు. అలాగే నీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వేణు మాధవ్ మృతి అని ఓ ప్రముఖ ఛానల్లో వచ్చిందని దానిని చూసిన తను ఆశ్చర్యపోయానని.. ఐతే ఆ విషయంలో తాను డీ.జీ.పి, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ వద్దకు వెళ్లి తాను బతికుండగానే చనిపోయానని ప్రముఖ ఛానల్ లో వచ్చిందని వేణుమాధవ్ ఫిర్యాదు చేయడం జరిగింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago