కొన్నిసార్లు మనకు తెలియకుండా మనం చేసే చిన్నచిన్న పొరపాట్లే చనిపోవడానికి కారణమవుతూ ఉంటాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ లో ఒక యువతి ఎలుకను చంపడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో వాటిని చంపడం కోసం యువతి రెండు టమాటా పండ్ల ముక్కల్లో ఎలుకల మందు కలిపింది. అయితే ఎలుకల మందు కలిపిన విషయాన్ని మరిచిపోయిన యువతి చివరకు తనే చనిపోయింది.
పూర్తి వివరాల్లోకి వెళితే ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ దీపారాపారా గ్రామంలో పాయల్ సాహు అనే యువతి తన కుటుంబంతో కలిసి నివశించేది. ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువ కావడంతో టమాటాలను ముక్కలుగా చేసి పాయల్ వాటిలో ఎలుకల మందు పెట్టింది. అయితే రోజంతా వేర్వేరు పనుల్లో బిజీగా ఉన్న పాయల్ అనుకోకుండా ఆ టమాటా ముక్కలను తినింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యంలోనే యువతి మృతి చెందింది.
యువతి కుటుంబ సభ్యులు విషం కలిపిన టమాటాలతో చేసిన సలాడ్ వల్లే యువతికి ప్రాణాపాయం ఏర్పడిందని.. వాంతులు కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని.. కానీ ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయిందని చెబుతున్నారు. అయితే యువతి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండగా పోలీసులు అనుమానాప్సద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే దర్యాప్తు తరువాత మాత్రమే అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. యువతి మృతి విషయంలో కుటుంబ సభ్యులు కొంత సమాచారాన్ని దాస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…