Featured

Jabardasth Apparao : వాడుకుని వదిలేసారు… జబర్దస్త్ కోసం సినిమాలు కూడా వదులుకున్నా… వారికే ఎక్కువ పేమెంట్…!

Jabardasth Apparao : జబర్దస్త్ వేదిక ఎంతోమంది కళాకారులకు జీవితాన్ని ఇస్తోంది. ఇప్పటికీ ఎంతోమంది కొత్తవాళ్లకు అవకాశాన్ని ఇస్తోంది. ఈ షోలో ఒక్కసారి పాల్గొంటే జీవితం మారిపోతుంది, కెరీర్ పీక్స్ కి వెళ్ళిపోతుంది అని చాలా మంది ఆర్టిస్టులు భావిస్తారు. అందుకే సాధారణ వ్యక్తులే కాకుండా అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా ఈ షోలో స్కిట్స్ లో నటించి సందడి చేస్తుంటారు.

వాడుకుని వదిలేస్తారు…

ఇక జబర్దస్త్ లో మనకు కనిపించేది స్కిట్లు నవ్వులు మాత్రమే, అందుకోసం కష్ట పడుతున్న ఆర్టిస్టుల సంగతి మనకు పెద్దగా తెలియదు. అయితే జబర్దస్త్ వల్ల చాలా మంది లైఫ్ సెటిల్ అవ్వడం మాత్రం నిజం. జబర్దస్త్ లో ఉన్నంత వరకు వారి జీవితం వైభవంగా ఉన్నా ఒక్కసారిగా జబర్దస్త్ వీడాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక సినిమా అవకాశాలతో కొంతమంది పర్వాలేదనిపించినా మరికొంత మంది మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో అప్పారావు గారు ఒకరు. జబర్దస్త్ లో చాలా మంచి స్కిట్లను చేసి పేరు తెచ్చుకున్న అప్పారావు కొన్నాళ్ళకు ఏకంగా టీం లీడర్ కూడా అయ్యారు. ఒక స్కిట్ చేస్తే ఆయనకు ఉన్న డిమాండ్ బట్టి పదివేల రూపాయల పారితోషకం వచ్చేదని అయితే ఏ నాడూ రెమ్యూనరేషన్ కోసం డిమాండ్ చేయలేదని జబర్దస్త్ జీవితాన్ని ఇచ్చింది, అందుకే ఆ షో కోసం చాలా సార్లు సినిమా అవకాశాలను కూడా వదులుకున్నానని తెలిపారు. కానీ సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని అవసరం తీరాక జబర్దస్త్ వాళ్లను వదిలేస్తుందని అప్పారావు కామెంట్స్ చేసారు.

షోలో ఏ స్కిట్ కి ఎంత రేటింగ్ వస్తుందో దాన్ని బట్టే ఆ టీం కి రెమ్యూనరేషన్ ఇస్తారని చమ్మక్ చంద్ర ఉన్నపుడు తనకు ఎక్కువ పేమెంట్ వచ్చేదని ఆ తరువాత సుధీర్ టీం కి, ఆది టీం కి ఎక్కువ రెమ్యూనరేషన్ ఉందని చెప్పారు. ఇక స్కిట్స్ విన్ అయితే వచ్చే డబ్బులను టీం లీడర్ తీసుకుంటాడని టీం లో వాళ్లలకు చాలా మంది పంచరని వారికి స్కిట్స్ కు ముందు ఎంత ఇస్తామంటారో అంతే పేమెంట్ ఉంటుందని చెప్పారు. అయితే మల్లెమాల లో పేమెంట్స్ పెరగడమే కానీ తగ్గడం చాలా తక్కువ అని చెప్పారు.

Bhargavi

Recent Posts

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

17 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

1 day ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

1 day ago