బుల్లితెరపై కమెడియన్ గా, యాంకర్ గా, మెజీషియన్, నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెజీషియన్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత జబర్దస్త్ స్టేజ్ పై అడుగు పెట్టారు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సుధీర్ ఏకంగా టీమ్ లీడర్ గా ఎదిగారు.అలాగే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ తర్వాత పలు కార్యక్రమాలలో చేస్తూ బిజీగా ఉన్నారు.
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మాత్రమే కాకుండా ఢీ కార్యక్రమం, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలను కూడా చేస్తున్నారు.శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా యాంకర్ గా కొనసాగుతున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం ఏ మాత్రం ఖాళీగా లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పవచ్చు.
ఈ విధంగా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సుధీర్ వెండితెరపై కూడా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఈ విధంగా వెండితెరపై బుల్లితెరపై ఎంతో బిజీగా గడుపుతున్న సుధీర్ ఆస్తిపాస్తులను కూడా బాగా వెనకేసుకున్నట్టు తెలుస్తుంది. సుధీర్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు కావస్తుండడంతో ఆస్తులను కూడా బాగా సంపాదించారని తెలుస్తోంది.
నెలరోజులలో ఏమాత్రం ఖాళీ లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్న సుదీర్ సంవత్సరానికి సుమారు 40 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ఆస్తుల విషయాలు బయటపెట్టడంతో సుడిగాలి సుదీర్ తనకు హైదరాబాద్లో రెండు ఇళ్లు ఉన్నాయనే విషయాన్ని తెలియజేశారు. ఇంత పెద్ద మహానగరంలో ఒక ఇల్లు ఉండడమే గగనం అయితే సుధీర్ ఏకంగా రెండు ఇళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇక స్థిరాస్తులు కూడా సుదీర్ కు బాగానే ఉన్నాయని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే సుధీర్ ఆస్తి సుమారు 5 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత సమయంలోనే సుదీర్ ఇంతటి స్థాయికి చేరుకొని ఆస్తులను కూడా పెట్టడంతో ఈ విషయం తెలిసిన వాళ్లు ఎంతో ఆశ్చర్యపోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…