ప్రతీ స్త్రీకి అమ్మతనం అనేది దేవుడు ఇచ్చే వరం. తల్లిగా తనను తాను పిలిపించుకోవాలని అనుకుంటుంది ఏ మహిళ అయినా. అయితే గర్భం దాల్చిన దగ్గర నుంచి కడుపులో పెరుగుతున్న బిడ్డ డెలివరీ అయ్యే వరకు ఆ తల్లి పడే బాధ మామూలుగా ఉండదు.
అయితే అలాంటి బాధ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనకున్నాడో ఓ టిక్ టాకర్. దానికి అనుగుణంగానే తనను తాను ఓ గర్భం దాల్చిన మహిళగా మార్చేసుకున్నాడు. మెయిట్ ల్యాండ్ హాన్లీ అనే ఒక ప్రముఖ టిక్‌టాకర్ తన పొట్టకు ఓ పుచ్చకాయని కట్టుకున్నాడు. అచ్చం గర్భిణి దాల్చిన మహిళ ఎలా ఉంటుందో అలా మార్చుకున్నాడు. తన చెస్ట్ దగ్గర కూడా రెండు వైపులా పుచ్చకాయలను అమర్చుకున్నాడు.
రోజంతా ఇలా ఉండాలని అతడు వీడియో తీసుకున్నాడు. కానీ అతడు కొన్ని గంటలు కూడా ఉండలేకపోయాడు. బెడ్ పై పడుకున్న అతడు లేవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అంతే కాకుండా బాత్రూంకి వెళ్లడం.. షూస్ ధరించడం వంటివి అభినయించాడు కానీ ప్రతి ప్రయత్నంలోనూ చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడికి గర్భిణీల బాధను భరించడం అంత సులువైన పనికాదని అర్థమైంది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్నారు. ఒక గర్బిణి ప్రసవ వేదన ఇంత కష్టంగా ఉంటుందా.. అంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…