Jabardasth Varsha: బుల్లితెర పై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం రోజు రోజుకు విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నేడు ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా గెటప్ శ్రీను ఏకంగా యముడి పాత్రలో సందడి చేశారు. ఇక ఈ స్కిట్ లో ఆటో రాంప్రసాద్, వర్షా, ఇమాన్యుయల్, సుజాత రాకేష్ వంటి తదితరులు పాల్గొన్నారు.
ఈ స్కిట్ లో గెటప్ శీను యముడుగా నటించగా ఆటో రాంప్రసాద్ ఆయన అనుచరుడిగా నటించారు.సుజాత రాకేష్ వర్ష ఇమ్మానుయేల్ వంటి వారు భూమిపై తప్పులు చేసి నరకానికి వెళ్లిన వారిగా నటించారు. ఇక ఆటో రాంప్రసాద్ ఇమ్మానియేల్, వర్షను చూడగానే వీళ్ళు చాలా డేంజర్ గా ఉన్నారని చెప్పడంతో యముడు సైతం అవును డేంజర్ గానే ఉన్నారని అంటారు.
ఇక వీరు చేసిన తప్పులకు శిక్ష పడకూడదు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ నిజమైనదని నిరూపించుకోవాలి అంటూ టాస్క్ ఇస్తారు. ఈ టాస్క్ లో భాగంగా వర్ష ఇమ్మానుయేల్ పై తనకున్న ప్రేమను బయటపెట్టారు. ఇమ్ము మనిద్దరిని చూస్తుంటే చాలామందికి ఎన్నో సందేహాలు వస్తున్నాయి. అసలు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అని అనుమాన పడుతున్నారు. అందుకు సమాధానం ఇదే అంటూ ఆమె తనపై ఉన్న ప్రేమను బయట పెట్టారు.
ఈ సందర్భంగా వర్ష ఇమ్మానియేల్ గురించి మాట్లాడుతూ ఎప్పుడైతే తనని కాదంటాడో ఆ రోజే తన ఊపిరి ఆగిపోతుంది అంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు.ఈ విధంగా వర్ష ఇమ్మానుయేల్ పై ఉన్న ప్రేమను బయట పెట్టడంతో ఇమ్మానుయేల్ ఎంతో సంతోషపడతాడు. అదే సమయంలోనే ఒకే ఒక లోకం నువ్వు అనే సాంగ్ ప్లే చేయడంతో ఒక్కసారిగా వేదికపై నవ్వులు పూయించాయి. అయితే ఇదంతా కూడా కేవలం స్కిట్ కోసమే అనే విషయం అందరికీ తెలిసిందే.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…