Pavan Tej: ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి పలువురు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు కొణిదెల పవన్ తేజ్. మెగా వారసులుగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారంటే ఆ హీరోకి పెద్ద ఎత్తున మెగా కుటుంబం అండ ఉంటుంది. కానీ ఈ హీరోకి మాత్రం మెగా కుటుంబం ఏ మాత్రం మద్దతు తెలుపలేదని తెలుస్తోంది. ఈయన నటించిన ఈ సినిమా ఎలాంటి చప్పుడు లేకుండా వచ్చి వెళ్లిపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఆచార్య సినిమాలో కూడా ఈయన ఓ పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఈయన గురించి పెద్దగా ఎవరికి తెలియదని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా పవన్ తేజ్ ప్రముఖ యాంకర్ మేఘనతో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు హాజరయ్యారు. అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా ఈ వేడుకకు హాజరైనట్టు తెలుస్తోంది. పవన్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. నేను ఆమెను ప్రేమిస్తున్నాను… ప్రేమంటే ఏంటో ఆమె వల్లే నాకు తెలిసింది.మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది అంటూ ఈయన తన నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేశారు.
ఇకపోతే యాంకర్ మేఘన సైతం నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేస్తూ నా ప్రేమను కనుగొన్నాను, అతనితో నిశ్చితార్థం కూడా జరిగింది.. నా మనసు గాల్లో తేలిపోతుంది అలాగే చేతులు కూడా బరువెక్కాయి.. నా జీవితం మొత్తం నీకే సొంతం అంటూ వీరి నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…