Nagababu: సినీ నటుడు నాగబాబు ఇటీవల ఏపీ రాజకీయాలను ఉద్దేశిస్తూ పరోక్షంగా అల్లు అర్జున్ పై చేసిన పోస్ట్ సంచలనగా మారిన సంగతి తెలిసిందే. ఇలా ఈయన పోస్ట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశారన్న విషయం స్పష్టంగా తెలియడంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో దెబ్బకు నాగబాబు ట్వీట్ డిలీట్ చేశారు.
ట్విట్టర్లో యాక్టివ్ అయినటువంటి నాగబాబు ట్వీట్ డిలీట్ చేశానంటూ మరొక ట్వీట్ చేయడంతో ఈ కామెంట్లపై జనసేన పార్టీ నుంచి ఇటీవల వైసిపికి వచ్చినటువంటి పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్నేక్ (బాబూ) కి పాలు పోసి పెంచిన కాటు వేయక తప్పదని కామెంట్లు చేశారు.
వాడుకొని వదిలేసేవారికి నమ్మకంగా ఉండని వారికి స్నేహం విలువ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబం అని తెలిపారు.మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు.. నా పేరు సూర్య సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న పుష్ప.
పార్టీకి విరాళం..
ఇక 2019 లో జనసేన పార్టీకి రూ.2 కోట్ల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు అంటూ పరోక్షంగా నాగబాబును ఉద్దేశిస్తూ చేసిన ఈ పోస్టు సంచలనంగా మారింది. ఇలా పరోక్షంగా నాగబాబు గురించి పోతున్న మహేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తిరిగి పవన్ అలాగే మెగా అభిమానులు పోతిన మహేష్ పై తీవ్రస్థాయిలో విమర్శిస్తూ కామెంట్లు చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీరి మధ్య యుద్ధం నడుస్తోందని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…