సమంత విడాకుల వ్యవహారంతో హాట్ టాపిక్ గా మారిన సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి. సమంత-నాగ చైతన్యలు విడిపోకముందే జోస్యం చెప్పాడు. అతడు చెప్పిన విధంగానే జరిగింది. ఇతగాడు.. అఖిల్ కు నిశ్చితార్థం జరిగినా పెళ్లి జరగదని తేల్చిచెప్పాడు. అది కూడా అక్షరాల అదే జరిగింది. వేణు స్వామి చాలా మంది సినీ ప్రముఖులకు జ్యోతిష్యుడు.
రాజకీయ పార్టీల భవిష్యత్తుపై కూడా జ్యోతిష్యం చెబుతాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్ 17 ఏళ్లపాటు సీఎంగా కొనసాగనున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఆయన నిజానికి రాజకీయాల్లోకి వచ్చారు. 2024 నాటికి పార్టీ ఉండదు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ కూడా భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసింది. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి..? దానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే సమాధానం అన్నారు.
“ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు చాలా బాగుంది. టీడీపీ గెలుపుకు ఏకైక మార్గం జూనియర్ ఎన్టీఆర్ అని అన్నాడు. ఈ విషయం ఇప్పుడే కాదు.. రెండేళ్ల క్రితం కూడా చెప్పానన్నాడు. చంద్రబాబు వల్ల గానీ.. లోకేష్ వల్లగానీ టీడీపీని గట్టెక్కించడం కష్టం అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వల్లనే టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాడు. 2024లో చంద్రబాబు, లోకేష్ లతో కలిసి టీడీపీ ఎన్నికలకు వెళితే అసలు పోటీ కూడా లేకుండా పోతుందని.. బాలకృష్ణ జాతకాన్ని బట్టి చూస్తే.. ఆయనకు సీఎం అయ్యే యోగం లేదన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కు వందశాతం అదృష్టం ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ స్టార్.. జయలలిత కూడా అదే స్టార్. ఈ నక్షత్రంలో పుట్టిన వారు రాజకీయాల్లో రాణిస్తారు. ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ జాతకం. రాజకీయాల్లోకి వస్తే ఇక తిరుగుండదు’ అన్నాడు వేణుస్వామి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…