Tadipatri: తాడిపత్రి కేరాఫ్ జేసీ బ్రదర్స్ అనే విధంగా ఇన్ని రోజులు ఉండేది. అక్కడ వారు చెప్పిన మాటే శాసనం అయితే గత ఐదు సంవత్సరాలుగా వీరి మాటకు విలువ లేకుండా పోయింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ బ్రదర్స్ అరాచకాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే గత ఎన్నికలలో భాగంగా జేసీ వర్గీయులు అలాగే పెద్దారెడ్డి వర్గీయుల మద్యం పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ గొడవలలో భాగంగా ఇరువురి అనుచరులు రాళ్లదాడి బాంబుల దాడి చేసుకున్నారు అయితే ఈ గొడవలను సర్దుమనగడం కోసం పోలీసులు దివాకర్ రెడ్డి ఇంట్లో పని చేస్తున్నటువంటి పని వాళ్ళను కూడా అరెస్టు చేశారు అయితే దివాకర్ రెడ్డి భార్యతో పాటు తన అక్క కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంచంపై ఉన్నారు కనీసం వారికి తిండి పెట్టి మందులు ఇచ్చేవారు కూడా లేకపోవడంతో జెసి పవన్ రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే పోలీసులతో ఆయన మాట్లాడి వారి ఇంట్లో పని చేసే వారిని విడిపించాలని కోరారు. అది కుదరదని పోలీసులు చెప్పారు మీరు కూడా బయటకు రాకూడదని ఒకవేళ తిరిగితే చర్యలు తీసుకోక తప్పదని పోలీసులు హెచ్చరించడంతో చేసేదేమీ లేక జెసి దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల మొత్తం తాడిపత్రి వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయారు.
144 సెక్షన్ అమలు…
ఇలా తాడిపత్రిలో చోటు చేసుకున్నటువంటి గొడవల కారణంగానే వీరు చివరికి తాడిపత్రి వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇకపోతే జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు మాత్రం తాడిపత్రిలో పూర్తిగా రెచ్చిపోయి దాడులకు పాల్పడటంతో తాడిపత్రి పట్టణం మొత్తం 144 సెక్షన్ అమలు చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…