Jordar Sujatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగడమే కాకుండా ఏకంగా సినిమా అవకాశాలను అందుకొని వెండితెరపై సందడి చేస్తున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ ఒకరు. వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఇకపోతే రాకింగ్ రాకేష్ సుజాత ఇద్దరు లవ్ స్కిట్లు చేయటం వల్ల కేవలం జబర్దస్త్ కోసమే ఇలాంటి స్కిట్లు చేస్తున్నారని అందరూ భావించారు కాకపోతే వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాన్ని తెలియజేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. పెళ్లికూడా చేసుకోబోతున్నామని చెప్పిన ఈ జంట తరచూ పలు ప్రాంతాలను సందర్శిస్తూ పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా రాకింగ్ రాకేష్ తో కలిసి సుజాత తిరుపతి వెళుతున్నానని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేశారు. ఇలా తిరుపతి వెళ్తూ దారిలో నగరిలో ఉన్నటువంటి రోజా గారి ఇంటికి వెళ్లి తనని కలిసి వెళ్తామని ఈ వీడియో ద్వారా తెలియజేశారు.ఇక రోజా గారి వల్లే మా ప్రేమ విషయాన్ని బయటకు చెప్పే అవకాశం వచ్చిందని సుజాత ఈ సందర్భంగా వెల్లడించారు.
ఒకవేళ రోజా గారు లేకపోతే తన ప్రేమ విషయం ఇంత తొందరగా బయటకు రాదని తన వల్లే మా ప్రేమ విషయం బయటపడటమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని తెలిపారు. ఇలా మరి కొద్ది రోజులలో తన పెళ్లి తేదీని కూడా ప్రకటిస్తామని సుజాత చెప్పడంతో ఈ విషయం కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు జోర్దార్ సుజాత, రాకేష్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…