Naga Babu:తెలుగు సినిమా పరిశ్రమలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇక మెగా కుటుంబంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ నాగబాబు మాత్రం హీరోగా సక్సెస్ కాలేకపోయారు. ఈ క్రమంలోనే నాగబాబు అంజన ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాతగా మారారు. ఇలా ఈయన పలు సినిమాలను నిర్మించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే నాగబాబుకు ఒక కుమారుడు కూతురు అనే విషయం మనకు తెలిసిందే వరుణ్ తేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండగా నిహారిక మాత్రం 2020 డిసెంబర్లో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకొని ప్రస్తుతం వెబ్ సిరీస్లను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే నిహారిక పెళ్లి జరిగి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు తన అల్లుడికి ఇచ్చిన కట్టకానులకు సంబంధించిన వార్తల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగబాబు తన కూతురి వివాహాన్ని రాజస్థాన్ లోని పురాతనమైన కోటలో ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది.ఈ పెళ్లి కోసమే నాగబాబు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు సమాచారం. ఇది కాకుండా తన అల్లుడికి 15 కోట్ల రూపాయల కట్నం ఇచ్చారని దీనితో పాటు ఒక ఖరీదైన కారు ఇల్లు కూడా కట్నంగా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
ఇక పెళ్లి కోసం నిహారికకు నాగబాబు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల విలువచేసే ఆభరణాలను కొనుగోలు చేశారు. ఇలా నిహారిక పెళ్లి కోసం అన్ని ఖర్చులు కలుపుకుంటే నాగబాబు దగ్గర దగ్గరగా 40 కోట్లకు పైగా ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా పెళ్లి విషయంలో కట్న కానుకల విషయంలో నాగబాబు మెగా రేంజ్ కి ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది.ఇక పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి నిహారిక ప్రసాదం వెబ్ సిరీస్ లకు నిర్మాతగా మారి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…