Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా తర్వాత ఇప్పటివరకు మరొక సినిమాని చేయలేదు. ఇక ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమాలపై భారీ అంచనాలే పెరిగాయి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇక తాజాగా పూజా కార్యక్రమాలు ప్రారంభించిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను ఎన్టీఆర్ షేర్ చేశారు.
ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెడుతున్నటువంటి వీడియోని షేర్ చేస్తూ వస్తున్న అంటూ ఎంతో గంభీరమైన గొంతుతో చెబుతున్నటువంటి వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియో షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో ఎన్టీఆర్ వాయిస్ వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, కే హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తెలుగు పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…