Jr.NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి తారక రామారావు నెంబర్ వన్ హీరోగా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాగే ఆయన వారసులుగా కొడుకు నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు.
ఇదిలా ఉండగా నందమూరి తారకరామారావు సొంత ఊరు నిమ్మకూరు అంటే ఎంతో ఇష్టమని కనీసం 10 రోజులకు ఒకసారి అయినా అక్కడికి వెళ్లి కొంతకాలం ఉంటారని మంత్రి కొడాలి నాని వెల్లడించాడు. కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. కొడాలి నాని రాజకీయాలలోకి రాకముందు నుండి ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కి మంచి స్నేహితుడు. ఇప్పటికీ మీరు మధ్య ఆ స్నేహబంధం కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా ఇటీవల మీడియా ముందు జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల వివరాల గురించి కొడాలి నాని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ కి తన తాత ఆస్తి నుండి ఐదు ఎకరాలు వారసత్వంగా వచ్చిందని కొడాలి నాని తెలిపాడు. అయితే తన తాత గుర్తుగా సొంత ఊరిలో పొలం ఉండాలన్న భావనతో ఎన్టీఆర్ ఆ పొలాన్ని అమ్మకుండా దానికి తోడు మరొక 25 ఎకరాలు భూమి కొన్నాడని కొడాలి నాని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం నిమ్మకూరులో తాత వారసత్వంగా వచ్చిన ఐదు ఎకరాల భూమి విలువ 10 కోట్ల రూపాయల విలువ ఉంటుందని కొడాలి నాని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ ఊరి కోసం నందమూరి కుటుంబ సభ్యులు ఎంతో చేశారని, అయితే చంద్రబాబు మాత్రం తన అత్తగారింటికి ఒకరోజు కూడా వచ్చిన పాపాన పోలేదని చంద్రబాబుపై విమర్శలు కురిపించాడు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…