యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై అడుగుపెట్టి బిగ్ బాస్ రియాలిటీ షోను ఎంతటి విజయవంతం చేశారో మనకు తెలిసింది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ వరుసగా నాలుగు సీజన్లను పూర్తిచేసుకొని ఐదవ సీజన్ కు ముస్తాబవుతోంది. బిగ్ బాస్ తర్వాత ఎన్టీఆర్ బుల్లితెరపై ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదు. జెమినీ టీవీలో ప్రసారం కాబోయే ఎవరు మీలో కోటీశ్వరుడు? కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే ఎప్పుడో ఈ కార్యక్రమం ప్రసారం కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల ఈ కార్యక్రమ షూటింగ్ వాయిదా పడింది. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితులు చక్కపడుతుండడంతో మెల్లిగా అన్ని కార్యక్రమాలు షూటింగ్ లను జరుపుకుంటున్నాయి. ఎన్టీఆర్ నటిస్తున్న టువంటి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమై శరవేగంతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమా తర్వాత తారక్ కొరటాల శివ సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాల మధ్యలోనే తారక్ ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.”ఆట నాది గెలుపు మీది” అంటూ నయా షో తో రాబోతున్నట్టుగా ఇది వరకే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగానే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి సంబంధించి నేటి (జూలై 10) నుంచి జూలై 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం షూటింగ్లో పాల్గొననున్నారనే వార్త వినబడుతుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం అతి త్వరలోనే ప్రసారం కాబోతోంది అని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…