Movie News

హరి గుండెలపై అషురెడ్డి పేరు.. లాగి చెంపపై కొట్టిన బిగ్ బాస్ బ్యూటీ!

పచ్చబొట్లకు అషురెడ్డికి ఏదో విడదీయరాని బంధం ఉందని చెప్పవచ్చు.అప్పుడు పవన్ కళ్యాణ్ పేరును తన ఎద పై పచ్చబొట్టు వేయించుకొని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన అషురెడ్డి మరోసారి కూడా ఈ పచ్చబొట్టు ద్వారా హాట్ టాపిక్ గా మారారు. అయితే ఈ సారి పచ్చబొట్టు వేయించుకొని కాదు.. తన పేరును పచ్చబొట్టు వేయించుకున్నందుకు ఈమె వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు.

సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ పలు టీవీ కార్యక్రమాలలో సందడి చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ కార్యక్రమంలో కామెడీ చేసే ప్రయత్నం చేస్తున్న అషురెడ్డికి కమెడియన్ హరి షాకింగ్ విషయాన్ని తెలిపారు. ఈ మధ్యకాలంలో వీరిద్దరి మధ్య స్కిట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ విధంగా వీరిద్దరూ రొమాంటిక్ సన్నివేశాలతో స్కిట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని అభిమానులు భావిస్తున్నారు.

తాజాగా హరి కామెడీ స్టార్ట్ కార్యక్రమంలో భాగంగా చేసిన స్కిట్ లో ఏకంగా అషురెడ్డి పేరును తన గుండెల పైన పచ్చబొట్టు వేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనే అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఈ స్కిట్ లో భాగంగా హరి అషురెడ్డి వెంటపడుతూ లవ్ ప్రపోజ్ చేస్తాడు. నువ్వు చీ కొట్టినా.. చెంప మీద కొట్టినా.. నీ వెనకాల తిరిగి నువ్వే కావాలనుకుంటున్నాను చూసావా? అందులోనే నిజమైన ప్రేమ ఉంది అమ్మాయి ప్రేమ కలలో కనబడితే అబ్బాయి ప్రేమ కన్నీళ్ళలో కనబడుతుంది అంటూ భారీ డైలాగులు చెబుతూ నిన్ను ఎక్కడ పెట్టుకున్నానో తెలుసా అంటూ తన గుండెల పైన పచ్చబొట్టును చూపించాడు.

ఈ విధంగా హరి తన గుండెలపై అషురెడ్డి పేరును చూసి షాక్ అయిన ఈ బ్యూటీ యేయ్ స్కిట్ కోసమేనా… లేకపోతే ఏంటి? అని అడగగా ..అందుకు హరి నిజంగానే పచ్చ బొట్టు వేయించుకున్నా అని అనడంతో ఆశు రెడ్డి కోపంతో లాగి చెంపపై ఒకటి ఇచ్చింది.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఇది స్కిట్ లో భాగంగా చేశారా లేక నిజంగానేనా అనే విషయం తెలియాలంటే పూర్తి కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago