Kakinada Shyamala : ఇండస్ట్రీ ఎన్నో ప్రేమ కథలు. అయితే వాటిలో పెళ్లి దాకా వెళ్ళేవి కొన్నయితే అసలు మొదట్లోనే కనుమరుగయ్యేవి మరికొన్ని. అయితే కొంతమంది మాత్రం వారి ప్రేమ కోసం అందరినీ కాదని పెళ్లి చేసుకుని చూపిస్తారు. కానీ అలాంటి పెళ్లి బంధాలు కూడా మధ్యలోనే తెగిపోతాయి. అలాంటి ఒక స్టార్ జంట తమిళ హీరో ప్రభు అలాగే హీరోయిన్ ఖుష్భూ ల పెళ్లి. వారిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. పెళ్లి కుడా చేసేసుకున్నా అది ఎక్కువ కాలం నిలబడలేదు. చాలా మందికి తెలియని ఈ విషయం గురించి అలనాటి నటి కాకినాడ శ్యామల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
వారిద్దరి పెళ్ళికి ఆమె ఒప్పుకోలేదు…
కాకినాడ శ్యామల గారు మరో చరిత్ర సినిమాతో లైంలైట్ లోకి వచ్చారు. ఆ సినిమా తరువాత వయసు చిన్నదే అయినా తల్లి వేషాలు ఎక్కువగా వేసి దాదాపు అందరు హీరోలకు తల్లిగా చేసిన ఆమె ఇండస్ట్రీలోని పలు విషయాల గురించి మాట్లాడుతూ ప్రభు ఖుష్భూ విషయం గురించి కూడా తెలిపారు. ప్రభు ఖుష్భూ ఎంతో గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసేసుకున్నారని, అయితే అప్పటికే పెళ్ళైన ప్రభు తన భార్య వైపు నుండి అభ్యంతరం రావడం జరిగిందని తెలిపారు.
పెళ్ళైన ఆరు నెలలకే ఖుష్భూ తో విడిపోయారని తెలిపారు. అయినా ఇద్దరూ మళ్ళీ జీవితంలో అన్నీ మర్చిపోయి సాధారణంగా ఉంటున్నారని, ఖుష్భూ చాలా మంచి అమ్మాయి అంటూ డైరెక్టర్ ను మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటూ కాకినాడ శ్యామల తెలిపారు. ప్రస్తుతం ఆమె జీవితం చాలా బాగుంది మంచి భర్త, ఇద్దరు పిల్లల్లతో హ్యాపీగా ఉంది అంటూ తెలిపారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…