Kalyan Ram : ఎన్టీఆర్ ఇంటి బిడ్డగా నందమూరి వంశం నుండి వచ్చిన హరికృష్ణ తనయుడు కళ్యాణరామ్ తన తాత పేరును హెల్త్ యూనివర్సిటీ కి తీసేసి వైస్సార్ పేరును పెట్టడం గురించి స్పందించారు. ఇప్పటికే ఒక్కొక్కరిగా నందమూరి ఇంటి నుండి ఈ ఇష్యూ మీద ఘాటుగా స్పందిస్తూ మార్చొదంటూ విన్నవించుకుంటున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎవరినీ లెక్కచేయడం లేదు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
25 సంవత్సరాల క్రితం నాణ్యమైన విద్య కోసం ఆయన చేసిన ప్రయత్నానికి పేరు మార్చడం తప్పు…
నందమూరి కళ్యాణ్ రామ్ ట్విట్టర్ వేదికగా ఈ ఇష్యూ మీద స్పందించారు. తెలుగు ప్రజలైన మూడు ప్రాంతాల ప్రజలకు మేలు జరగాలని నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందాలని దృఢ సంకల్పంతో కట్టిన విశ్వవిద్యాలయం ఎంతో మంది నిపుణులైన వైద్యులను అందించింది. అలాంటి యూనివర్సిటీ కి ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన పేరు పెట్టారు. కేవలం రాజకీయాల కోసం 25 సంవత్సరాలుగా ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం ప్రజల భావొద్వేగాలతో ఆడుకోవడం మంచి విషయం కాదు.
అధికారం లో ఏ పార్టీ అయినా ఉండొచ్చు కానీ ఇలా భావొద్వేగాలతో రాజకీయం మంచిది కాదు. నాకూ బాధ కలిగించింది అని రాసుకోచ్చారు. ఇక ఈ ట్వీట్ ను చాలా మంది నందమూరి అభిమానులు రీ ట్వీట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ కంటే నువ్వే మిన్నగా స్పందించావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…
వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…
రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…
ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…