Sarika Hassan: లాక్ డౌన్ సమయంలో 3 వేల కోసం పని చేశా…కన్నీటి కష్టాలను తెలిపిన కమల్ హాసన్ మాజీ భార్య?
Sarika Hassan: కమల్ హాసన్ మాజీ భార్య, శృతి హాసన్ తల్లి సారిక హాసన్ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో నటించి ఎంతో గుర్తింపు పొందిన ఈమె ఒక స్టార్ హీరోకి భార్యగా, మరొక స్టార్ హీరోయిన్ తల్లిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ కరోనా సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సారిక కరోనా సమయంలో కేవలం మూడు వేల రూపాయల కోసం థియేటర్ ఆర్టిస్టులతో కలిసి పని చేసినట్లు వెల్లడించారు.
చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న సారిక కమల్ హాసన్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే పలు కారణాల వల్ల ఈమె తనకు విడాకులు ఇచ్చి ముంబై వెళ్లిపోయారు. ఇలా ముంబై వెళ్లిన సారిక ఆమెజాన్ ప్రైం ‘మోడ్రన్ లవ్ ముంబై’ అనే ఆంథాలజీలోని ‘మై బ్యూటీఫుల్ రింకిల్స్’ అనే పార్ట్‌లో నటించింది. ఇందులో నటించినందుకు గాను ఈమె ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కరోనా లాక్ డౌన్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి వెల్లడించారు. కమల్ హాసన్ తో విడాకులు తీసుకున్న తర్వాత ముంబై తిరిగివచ్చిన ఈమె నటిగా పలు పాత్రల్లో నటించి ఎంతో విసుగుచెంది నటనకు కొద్ది రోజులు దూరంగా ఉన్నారు. అదే సమయంలో లాక్ డౌన్ రావడం వల్ల తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పూర్తిగా ఖాళీ అయ్యాయని ,ఆ సమయంలోనే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు.
ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో థియేటర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేశానని ఆ సమయంలో తనకు 2000 నుంచి 3000 లోపు డబ్బులు చెల్లించే వారని తన కన్నీటి కష్టాలను ఈ సందర్భంగా తెలిపారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన సమయంలో తాను ఇండస్ట్రీలోకి తిరిగి రావడం మంచిదని భావించి ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చానని ఇంటర్వ్యూ సందర్భంగా తన కన్నీటి కష్టాలను తెలిపారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…