General News

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఒక గంటకు ఎంత సంపాదిస్తారో తెలుసా… తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఈ పేరు తెలియని వారు ఉండరు. మన దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు సంపాదించుకున్న ఈయన ప్రపంచంలోనే టాప్ టెన్ ధనవంతుడిగా పేరు సంపాదించుకున్నారు. రిలయన్స్ అధినేతగా ఎన్నో వ్యాపారాలు చేస్తూ మన దేశంలోనే ధనవంతుడిగా పేరు సంపాదించిన ముఖేష్ అంబానీ ఒక రోజుకు ఎంత సంపాదిస్తారు, అతని ఆస్తిపాస్తుల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఒక గంటకు ఎంత సంపాదిస్తారో తెలుసా… తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ముఖేష్ అంబానీ ప్రస్తుత 2022 వ సంవత్సరం వీరి ఆస్తి విలువ 9940 కోట్ల యుఎస్ డాలర్స్. మన దేశ కరెన్సీ ప్రకారం7.18 లక్షల కోట్ల రూపాయలు. వీరు ఒక రోజుకు 163 కోట్ల రూపాయలను సంపాదిస్తారు అంటే ప్రతి గంటకు 6 కోట్ల 79 లక్షల రూపాయలను సంపాదిస్తారు. ప్రతి నిమిషానికి 11 లక్షల 31 వేల రూపాయలను సంపాదిస్తారు. ఇలా ఈయన నిమిషానికి లక్షల్లో సంపాదిస్తూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఒక గంటకు ఎంత సంపాదిస్తారో తెలుసా… తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఇలా ఎంతో డబ్బు సంపాదించినప్పటికీ ఆయన బయటకు వెళ్ళేటప్పుడు చాలా సింపుల్ గా ఉంటారు. తన ఇంటిలో మొత్తం లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. ఇక ముంబైలో ఈయన ఇంటిలో అన్ని వసతులు ఏర్పాటు చేసి ఉన్నాయి. ముకేష్ అంబాని తన ఇంటికి అంటిలీయా అనే పేరు పెట్టుకున్నారు. అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న ఒక దీవి పేరును వీళ్లు వీరి ఇంటికి పెట్టుకున్నారు. ఈ ఇంటిని నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇంటి కోసం దాదాపు 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అన్ని సదుపాయాలతో నిర్మించుకున్నారు.

లక్షల్లో జీతాలు…

ఈ ఇంటినీ మెయింటెన్ చేయడం కోసం ఏకంగా ఆరు వందల మంది పనివాళ్ళు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ లక్షల్లో జీతాలు చెల్లిస్తారు. అంబానీ కారు డ్రైవర్ కి రెండు లక్షల రూపాయల జీతం చెల్లిస్తారు. ఇక వీరు ఇంటిలో కింది ఆరు ఫ్లోర్ లు కేవలం కార్ పార్కింగ్ కు మాత్రమే కేటాయించారు. ఏడవ ఫ్లోర్ లో కార్ సర్వీసింగ్ కోసం ప్రత్యేకంగా నిర్మించబడింది. వీరి ఇంట్లో 168 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇదే కాకుండా అన్ని సదుపాయాలతో కూడిన వ్యానిటీ బస్, మూడు ప్రైవేట్ జెట్ విమానాలు,అలాగే విలాసవంతమైన ఒక యాచ్ ఉంది. దీని ఖరీదు 600 కోట్లు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ముఖేష్ అంబానీ ఇంట్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.ఇలా ఈయన తన ఇంటి నిర్మాణంలో కూడా ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని జీవితాన్ని గడుపుతున్నారని చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago