Karate Kalyani: నేను పారిపోయే రకం కాదు.. పరిగెత్తించే రకం.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్!
Karate Kalyani: కరాటే కళ్యాణి గత మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున వివాదంలో ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డితో గొడవ కారణంగా ఈమె హాట్ టాపిక్ గా మారారు. అయితే ఈ వివాదం జరిగిన తర్వాత కరాటే కళ్యాణి ఫోన్ స్విచాఫ్ కావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ గొడవ జరిగిన సమయంలో కరాటే కళ్యాణి చేతిలో చిన్న పాప ఉండటం గమనార్హం.
ఈ క్రమంలోనే కరాటే కళ్యాణి చిన్నపిల్లలను దారుణంగా అమ్ముతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంటిని సోదా చేశారు. ఈ క్రమంలోనే తన ఇంటిలో ఉన్న చిన్నారి ఎవరు ఏంటి అని ఆరా తీశారు.ఈ విధంగా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తన ఇంటిపై దాడి చేశారన్న విషయం తెలుసుకున్న కరాటే కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ నేను చిన్నపిల్లలను సినీ సెలబ్రిటీలకు అమ్ముతున్నానని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. తాను బిజెపి పార్టీలో ఉండటం వల్ల కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఈమె తన గురించి వస్తున్న వార్తలను ఖండించారు. ఇక పోతే తాను భయపడి ఎక్కడికీ పారి పోలేదని, పారిపోయే రకం కాదని పరిగెత్తించి కొట్టే రకం అని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.
ఇక తన దగ్గర ఉన్న పిల్లల గురించి ఆమె మాట్లాడుతూ ఆ బాబు తనకు దొరకడంతో తనని పెంచుకుంటున్నారని అలాగే తనకు పిల్లలు లేకపోవడంతో ఆడపిల్లలు అంటే ఎంతో ఇష్టం ఉండటం వల్ల ఆ చిన్నారిని చట్టపరంగా దత్తత తీసుకున్నానని వెల్లడించారు. ఇక ఈ క్రమంలోనే ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ తనకు ముగ్గురు కూతుర్లు జన్మించారని అయితే తన భార్య ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కరాటే కల్యాణికి మనస్ఫూర్తిగా తన కూతురిని ఇచ్చామని చిన్నారి తల్లిదండ్రులు వెల్లడించారు. దత్తత కార్యక్రమం అంటే ఎన్నో ఫార్మాలిటీస్ ఉంటాయని అందుకే కరాటే కళ్యాణి తమ వద్దే ఉండాలని సూచించడంతో ప్రస్తుతం మేం కూడా తన వద్దే ఉంటున్నామని చిన్నారి తల్లిదండ్రులు ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…