Kanthara Daughter Susila : జానపద సినిమాలో కత్తి యుద్ధాలు చేసే హీరో అనగానే గుర్తొచ్చే హీరో కాంతారావు. ఆయన పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీకాంతరావు. అయన నాటకాలల్లో ప్రసిద్ధి చెంది ఆ తరువాత సినిమాల వైపు వచ్చారు. అనేక జానపద, సాంఘిక చిత్రాలలో నటించిన ఆయన దాదాపు 100 సినిమాలలో హీరోగా నటించారు. ఇక మిగిలిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే విలన్ గాను నటించారు. ముఖ్యంగా నారద పాత్రలో బాగా ఫేమస్ కాంతారావు గారు. ఎన్టీఆర్ తో సమానంగా పౌరాణిక జానపదాలలో నటించిన అయన అప్పటి సమకాలిన నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక చెన్నై లో స్థిరపడి ఆస్తులను కూడా సంపాదించిన కాంతారావు గారు చివరి రోజుల్లో మాత్రం సొంత ఇల్లు కూడా లేకుండా చనిపోయారు. ఇక ఆయన వారసులుగా ఆయన పిల్లలు కానీ మనవళ్లు కానీ ఎందుకు సినిమా ఇండస్ట్రీలో లేరు అనే విషయం పై ఆయన కూతురు సుశీల గారు క్లారిటీ ఇచ్చారు.
దాసరి మోహన్ బాబు గొడవ వల్ల నా కొడుకు సినిమాలో లేడు…
కాంతారావు గారు ఎన్నో వేల సినిమాలను చేసినా కొడుకులు సినిమాల్లోకి రాలేదు. అందరూ ఉన్నత చదువులు చదువుకుని స్థిరపడ్డారు. అయితే కాంతారావు గారు కూతురు సుశీల గారి అబ్బాయి ని సినిమాల్లో నటింపజేయాలని బాగా అనుకున్నారు. అలా దాసరి గారి డైరెక్షన్ లో మోహన్ బాబు తో వచ్చిన సినిమా ‘కొండవీటి సింహాసనం’ సినిమాలో అవకాశం కోసం ప్రయత్నించిగా అందులో కోట శ్రీనివాసరావు గారి కాంబినేషన్ లో సీన్స్ ఉన్నాయి.
షూటింగ్ అంతా అయ్యాక దాసరి గారికి కోటా శ్రీనివాసరావు గారికో లేక దాసరి గారికి మోహన్ బాబు గారికో సరిగా గుర్తులేదు కానీ ఆ గొడవల వల్ల కోటా గారి సీన్స్ మొత్తం సినిమాలో తొలగించారు. అలా మా అబ్బాయి సీన్స్ కూడా సినిమాలో లేకుండా పోయాయి. ఇక ఆ తరువాత సినిమాల మీద ఆసక్తి లేక నటించలేదు అంటూ ఆ సంఘటన గురించి చెప్పారు సుశీల.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…