Karan Johar : బాలీవుడ్ బడా డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ సౌత్ సినిమాల గురించి మరో సారి హాట్ కామెంట్స్ చేసారు. నార్త్ సినిమాలు జనాలను అక్కట్టుకోకపోవడం ఆ స్థానాన్ని సౌత్ సినిమాలు భర్తీ చేస్తుండడం పట్ల ఆయన విశ్లేషించారు. కేజీఎఫ్ 2 సినిమా నచ్చిందంటూనే అలాంటి సినిమా బాలీవుడ్ లో గనుక వచ్చుంటే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పారు.
మమ్మల్ని విమర్శలతో చంపేవారు…
ఈమధ్యనే కేజీఎఫ్ 2 చూసిన కరణ్ జోహార్ నిజం చెప్పాలంటే సినిమా నాకు చాలా నచ్చిందంటూ కామెంట్ చేసారు. బాలీవుడ్ లో దర్శకులు ఒక సినిమాలో చాలా అంశాలు చూపించాలని అనుకుంటూ తడబడుతున్నారు. కానీ సౌత్ దర్శకులు వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులకు అందిస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు ఆ విషయం నచ్చుతోందని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ లో కేజీఎఫ్ లాంటి సినిమా గనుక తీస్తే ఇక అంతే అంటూ కామెంట్స్ చేసారు. ఒకవేళ అలాంటి సినిమా తీస్తే విమర్శలు ఎదురవుతాయని, ఆ విమర్శలతోనే మమ్మల్ని చంపే వాళ్ళని అన్నారు.
ఇక కేజీఎఫ్ 2 సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చాక మరింత మందికి చేరువైంది. మొత్తంగా 1200కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది కేజీఎఫ్2 సినిమా. యష్ అభిమానులకే కాకుండా కామన్ ప్రేక్షకులకు కూడా తెగ నచ్చేసింది ఈ ప్రశాంత్ నీల్ సినిమా. ఇక యష్ నెక్స్ట్ సినిమా మేధా చాలా ఆశలే పెట్టుకున్నారు ప్రేక్షకులు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…