పోలీసులంటే చట్టాన్ని గౌరవిస్తూ న్యాయాన్ని కాపాడాల్సిన ఒక గౌరవమైన వృత్తిలో ఉన్నవారిగా భావిస్తారు. కానీ చాలా మంది తమ వృత్తికి అన్యాయం చేస్తూ అన్యాయానికి మద్దతుగా నిలబడుతున్నారు. పోలీసులు అడ్డగోలుగా సంపాదిస్తూ అవినీతికి తెరలేపుతున్నారు. ఇటువంటి అవినీతి పోలీసులపై అవినీతి నిరోధక శాఖ కొరడా జరిపిస్తుంది. గత పది రోజుల నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులు మూడు ఏసీబీ కేసులను నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
పోలీసులకు లంచం ఇవ్వకపోతే ఒక్క పని కూడా జరగదు. ఈ క్రమంలోనే బాధితులను టార్గెట్ చేసుకొని పోలీసులు వేళ్ళకు వేళ్ళు లంచాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లంచం తీసుకుంటున్న అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కేవలం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ విధంగా పోలీసులు సిబ్బంది అడ్డగోలుగా సంపాదిస్తున్నారని ఆరోపించారు.
గత పది రోజుల క్రితం జగిత్యాలలో రెండు ఏసీబీ కేసులు నమోదై ఇద్దరు ఎస్ఐ లతో పాటు ఒక రైటర్ అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఒక ఏఎస్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికారు. ఈవిధంగా బాధితుల నుంచి అధిక మొత్తంలో లంచాలు తీసుకోవడంతో బాధితులు ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ వారికి తెలియజేశారు.
ఈ సమాచారం అందుకున్న ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో అధికారులు , సిబ్బంది రంగంలోకి దిగి పోలీసుల పై తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ పృథ్విధర్ గౌడ్ , రైటర్ రమేశ్ లు ఇసుక ట్రాక్టర్‌ను వదిలివేసేందుకు రూ .10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ విధంగా పది రోజులలో ఇంత మంది పోలీసుల పై కేసులు నమోదు కావడంతో ఖాకీలు చేస్తున్నటువంటి లంచగొండి తనానికి ఇది నిదర్శనమని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఈ విధమైనటువంటి అవినీతికి అడ్డుకట్ట వేయాలని అధికారులు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…