Featured

కార్తీక్ కారులో రక్తపు మరకలు.. కంటతడి పెట్టిస్తున్న వంటలక్క పిల్లలు!

స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. గత ఎపిసోడ్ లో భాగంగా మోనితను కార్తీక్ చంపాడని ఏసిపి రోషిని దీప ఇంటికి వెళ్లి కార్తీక్ ను మోనితను శవాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అంటూ నిలదీస్తుంది. ఈ క్రమంలోనే ఈ సీరియల్ నేడు 1115 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి నేటి ఎపిసోడ్ లో హైలెట్స్ ఏమిటో తెలుసుకుందాం.. ఏసిపి రోషిని కార్తీక్ ఇంటికి వెళ్లి మోనిత శవాన్ని ఎక్కడ దాచారో చెప్పు కార్తీక్ అంటూ నిలదీయగా.. అందుకు దీప ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు.. మోనిత ఏంటి శవం ఏంటి అని అడగడంతో ఈ పుణ్యమూర్తి మీకు ఏమీ చెప్పలేదా.. అంటూ అని అడుగుతుంది. లేదు మేడం అనగా కార్తీక్ మోనితను గన్ తో షూట్ చేసే చంపేశాడు. అని చెప్పడంతో దీప షాక్ అవుతుంది. మా ఆయన ఇలా చేశారు అంటే మీరు నమ్ముతున్నారా.. నువ్వు నమ్మలేదా … అని అనడంతో మా ఆయన హత్య చేశారు అంటే నా మనసాక్షి నమ్మలేదు మేడం అయితే కోర్టు కొచ్చి సాక్ష్యం చెప్పమను నీ మనస్సాక్షిని అని రోషిని అంటుంది.దీప ఈ ప్రపంచంలో అందరూ నీలాగే పుణ్య మూర్తులు ఉండరు అని రోషిని దీపతో చెబుతుంది

ఈ క్రమంలోనే మోనితను చంపాననడానికి సాక్ష్యం ఏంటి అని అడగగా.. కానిస్టేబుల్స్ భాగ్యాన్ని లోపలికి తీసుకు వస్తారు.మేడం డాక్టర్ బాబు కారు డిక్కీలో రక్తపు మరకలు ఉన్నాయి అని చెబుతారు. అదేవిధంగా భాగ్యం రావడంతో భాగ్యం జరిగినది మొత్తం చెప్పు అంటూ రోషిని అంటుంది. ఈ క్రమంలోనే అక్కడ జరిగిన విషయాన్ని భాగ్యం చెబుతుంది. కేవలం నేను మాటలు మాత్రమే విన్నాను ఎవరు చంపినది చూడలేదు మేడం అంటూ భాగ్యం చెబుతుంది. ఎన్నిసార్లు షూట్ చేసినట్టు వినిపించింది అని రెండుసార్లు మేడం అంటూ భాగ్యం సమాధానం చెబుతుంది. అదేవిధంగా కార్తీక్ మోనిత సౌందర్య రివాల్వర్ తో షూట్ చేశాడు. మోనిత ఇంట్లో దొరికిన బుల్లెట్ ఇది. ఇది మీ మమ్మీ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ఇంకొకటి మోనిత బాడీలో ఉందంటూ బుల్లెట్ ను సాక్ష్యం చూపిస్తుంది.

ఇంతలోనే ఆదిత్య ఆనందరావు అక్కడికి వస్తారు. ఏం జరిగిందో నేను కంగారుగా లోపలికి వెళితే అక్కడ పోలీసులు ఉండటం చూసి జరిగిన విషయాన్ని మొత్తం తెలుసుకుంటారు. ఓకే మేడం నేను మా లాయర్ తో మాట్లాడి కార్తీక్ ను సరెండర్ చేస్తానని ఆనందరావు చెప్పగా.. సారీ సర్ ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ అని చెప్పి కార్తీక్ ని తీసుకురమ్మని అక్కడి నుంచి వెళ్తుంది. ఈ క్రమంలోనే కార్తీక్ దీప వైపు చూస్తూ నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నీకు కష్టాలు తప్పడం లేదు.. మోనిత కడుపుకు నేను ఎలా కారణమయ్యానో.. తన చావుకు కూడా అలాగే కారణం అయ్యాను మరోసారి మోసపోయాను దీప అంటూ బాధపడతాడు. దీప పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో.. మీరందరూ కలిసి నాన్న దగ్గరికి వెళ్లిపోండి.. నాన్న మీరు ఆరోగ్యం జాగ్రత్త టైం కి మందులు వేసుకోండి అని చెబుతాడు.

పోలీసులు కార్తీక్ ని తీసుకు వెళ్తుండగా భాగ్యం కార్తీక్ కాళ్ళపై పడి తప్పు చేశాను నన్ను క్షమించండి అల్లుడు గారు. పోలీసులకు నేనే మిమ్మల్ని పట్టించాను అంటూ క్షమాపణ కోరుతుంది. లేవండి అంటూ భాగ్యాన్ని లేపి దీపను జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతాడు. ఇంతలో గా పిల్లలు అక్కడికి రావడంతో పోలీసులు కార్తీక్ ను అరెస్టు చేసేది చూసి వెళ్లి గట్టిగా కార్తీక్ ను హత్తుకుని ఏడుస్తారు. అది చూసిన ఏసిపి రోషిని ఆవేశంలో అతను చంపేటప్పుడు తన పిల్లలు గుర్తు రాలేదా అని మనసులో అనుకుంటుంది. ఈ క్రమంలోనే దీప పిల్లలని తీసుకోగా పోలీసులు కార్తీక్ ను వెంటబెట్టుకుని వెళ్తారు. పిల్లలు తమ డాడీ కోసం ఏడుస్తూ ఉంటారు. జైల్లో కూర్చుని కార్తీక్ మౌనిక చేసిన మోసాలను గుర్తుచేసుకుంటూ బాధపడతాడు.ఇంతటితో ఎపిసోడ్ పూర్తికాగా తర్వాత ఎపిసోడ్ లో సౌందర్య వచ్చిమోనిత ని చంపింది తనేనని తనని అరెస్ట్ చేయాలని కోరుతోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago