KCR : బీఆర్ఎస్.. తెలంగాణ తర్వాత మహారాష్ట్రపైనే ఫోకస్ చేసింది. ఇక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి కలిసొస్తున్న అంశం. ప్రస్తుతం అక్కడ బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వం అదికారంలో ఉంది. ఇక ప్రతిపక్షంగా ఉన్న ఎన్సీపీ ఆసక్తికరంగా బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు చర్చ నడుస్తోంది. ఇక ఎన్సీపీ సైతం బీజేపీతో చేతులు కలిపితే అక్కడి ప్రజలకు మరో ప్రత్యామ్నాయం ఏముంటుంది? శివసేన-బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారికి ప్రత్యామ్నాయం ఏంది. ప్రతిపక్షం, పాలకపక్షం తేడా లేకుండా కలిసిపోవడంతో మహారాష్ట్రలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ శూన్యతను భర్తీ చేసేందుకే బీఆర్ఎస్ యత్నిస్తోంది. మహారాష్ట్ర ప్రజలు సైతం బీఆర్ఎస్‌కు మంచి సపోర్టే ఇస్తున్నారు. దీనికి నిదర్శనమే ఇప్పటి వరకూ పార్టీ నిర్వహించిన సభల సక్సెస్. నేడు బీఆర్ఎస్ ముచ్చటగా మూడో సభ నిర్వహించబోతోంది. ఈ క్రమంలో ప్రజలు బీఆర్ఎస్‌ను స్వాగతిస్తారా?అనే విషయాన్ని ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే టాప్..
ఇప్పటి వరకూ మహారాష్ట్రలో నాందేడ్, కందార్ లోహ అనే ప్రాంతాల్లో బీఆర్ఎస్ రెండు సభలు నిర్వహించింది. ఈ రెండూ కూడా సక్సెస్ అయ్యాయి. ఇక నేడు బీఆర్ఎస్.. ఔరంగాబాద్ వేదికగా సభ నిర్వహించనుంది. ఈ సభకు ఆసక్తికరంగా జనం పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని టాక్. ఈ పార్టీ సైతం తెలంగాణతో సాంస్కృతిక అనుబంధం ఉన్న మరఠ్వాడనే ఎక్కువగా ఫోకస్ చేసింది. మరఠ్వాడ.. హైదరాబాద్‌కు చాలా దగ్గర కావడంతో ఇక్కడి ప్రజనీకంతో వారికి అనుబంధం ఎక్కువ. మరఠ్వాడలో 54 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక ఇక్కడ బీఆర్ఎస్‌కు కలిసొచ్చే అంశం ఒకటుంది. నిజానికి రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మహారాష్ట్ర టాప్. మరఠ్వాడ పరిస్థితి కూడా దారుణమే. రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ అంశంపైనే ఫోకస్ చేశారు.
గ్రామస్థాయి నుంచే పార్టీ బలోపేతానికి..
తెలంగాణలో రైతుల కోసం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన మరఠ్వాడను తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చేస్తామంటూ బీఆర్ఎస్ హామీ ఇస్తోంది. ఇక్కడ చేపట్టిన సాగునీటి పథకాలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. మొత్తానికి మహారాష్ట్రలో పాగా వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం బాగానే కష్టపడుతోంది. తెలంగాణలో ఎలాగైతే క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చిందో మహారాష్ట్రలోనూ అదే విధంగా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కూడా మొట్ట మొదటగా బీఆర్‌ఎస్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గ్రామ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది.
బీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలిస్తాయా?
మొత్తానికైతే మహారాష్ట్రలో పాగా వేసేందుకు బీఆర్ఎస్ గట్టిగానే యత్నిస్తోంది కానీ ప్రయత్నాలు ఫలిస్తాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షం వెళ్లేసి అధికార పక్షంతో చేతులు కలపడమనేది ఎక్కడా జరగదు. కానీ మహారాష్ట్రలో ఇలా జరుగుతోందంటే అది బీఆర్ఎస్ కారణంగానేనన్న టాక్ అయితే నడుస్తోంది. ఇప్పటికే తమ మహాసభలకు మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందంటూ బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోంది. మహారాష్ట్ర గడ్డపై కేసీఆర్‌కు ఏం పని? అంటూ అక్కడి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం ప్రశ్నిస్తున్నారు. ివన్నీ మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలపడటానికి సంకేతాలేనని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. నేటి సభను బట్టి నిజంగానే అక్కడి మరఠ్వాడ ప్రజలు బీఆర్ఎస్‌కు కనెక్ట్ అవుతున్నారా? లేదా అనే అంశం తేలిపోతుంది. ఇప్పటికిప్పుడైతే మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు కానీ ఇలాగే పట్టుదలతో ముందుకు సాగితే.. అప్పటికి పరిస్థితులు అనుకూలిస్తే 2029కి బీఆర్ఎస్‌కి ఏమైనా అవకాశం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…