Featured

Chiranjeevi – Madhavi : అప్పట్లో ఈ జంట యమ క్రేజ్.. 1983 లో వచ్చిన వీరి మూడు చిత్రాల్లో ఒకటి ప్రేక్షకులను నిరాశపరిచింది.

Chiranjeevi – Madhavi : 1978 ప్రాణం ఖరీదు సినిమాతో ఈ జంట కలిసి వెండితెరపై మొదటిసారిగా కనిపించారు. అలా ప్రారంభమైన వీరి ఇద్దరి సినీ ప్రయాణం. అనేక విజయవంతమైన చిత్రాలలో ప్రేక్షకులను ఆనందపరిచారు. అలా 1983లో మూడు నెలల వ్యవధిలో వచ్చిన మూడు చిత్రాల్లో చిరంజీవి, మాధవి కలిసి నటించారు. ఆ మూడు చిత్రాలతో వెండితెరపై ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించారో చూద్దాం.

1983, జూలై లో పిఎన్ఆర్ పిక్చర్స్, కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో ‘రోషగాడు’ చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో చిరంజీవి, మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు.
కథలోకి వస్తే..

చిరంజీవి సికిందర్ శ్రీకాంత్ అనే రెండుపాత్రలు పోషించాడు సికిందర్ ఒక పెద్ద రౌడీ, నేరస్థుడు. వజ్రాలు, నగదు, ఆస్తులను స్మగ్లర్ల నుండి దొంగిలించి రహస్య ప్రదేశంలో (దుర్గా ఆలయం) దాస్తూంటాడు. ఒక రోజు స్మగ్లర్లు సికిందర్‌పై దాడి చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం.

1983 అక్టోబర్ 20న విజయసాయి పిక్చర్స్,కోడి రామకృష్ణ దర్శకత్వంలో “సింహపురి సింహం” చిత్రం విడుదల అయింది.ఈ సినిమాలో చిరంజీవి, మాధవి, రాధిక హీరో,హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తండ్రిగా నటించిన చిరంజీవికి (రాజశేఖరం) భార్యగా రాధిక, సోదరునిగా గొల్లపూడి నటించారు. అలాగే కొడుకుగా నటించిన చిరంజీవి(విజయ్) ప్రియురాలిగా మాధవి నటించారు. చిరంజీవి కోడి రామకృష్ణ కాంబినేషన్లో నాల్గవ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.

ఖైదీ 1983లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే చిత్రసీమలో పేరు శాశ్వతం చేసుకున్న కొన్ని పతాకాలున్నాయి. అడవి రాముడు తీసిన సత్యచిత్ర, వేటగాడు తీసిన రోజా మూవీస్ ఆ కోవకు చెందినవే. ఖైదీ చిత్రంతో సంయుక్త మూవీస్ అటువంటి కీర్తి సంపాదించుకుంది. చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ ఈ చిత్రంతోనే మొదలయ్యింది. చిరంజీవిని అగ్రనటునిగా, కోదండరామిరెడ్డిని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి సోదరులు ను ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రం. చిత్ర సమర్పకుడు ఎం. తిరుపతి రెడ్డి, దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి చిరంజీవితో కలిసి సినిమా చేయాలని భావించారు. అమెరికన్ సినిమా ఫస్ట్ బ్లడ్ (1982) ఆధారంగా ఒక కథను డెవలప్ చేయమని తిరుపతి రెడ్డి పరుచూరి సోదరులను కోరారు. అలా వారు తయారు చేసిన కథతో వచ్చిన ఈ సినిమా 1983 అక్టోబర్ 28న విడుదలైంది.


ఈ విధంగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటించిన వీరి మూడు సినిమాల్లో.. “ఖైదీ” సినిమా ఇండస్ట్రీ హిట్ కాగా.. “రోషగాడు” విజయవంతమై “సింహపురి సింహం” పరాజయం పొందింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago