Sarath Babu: ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన బెంగుళూరులో ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో కాస్త కోలుకోవడంతో ఈయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు కానీ ఆరోగ్యం క్షమించడంతో హైదరాబాద్లోని ఏఐజి ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.
గత మూడు రోజులుగా ఏఐజీలోనే చికిత్స తీసుకుంటున్నటువంటి ఈయన ఆరోగ్య పరిస్థితి గురించి తాజాగా వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఇంకా మరికొన్ని గంటల వరకు ఏమి చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు.
ప్రస్తుతం శరత్ బాబుకి ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందుతుందని తెలియజేశారు. ఇక ఈయనకు కాలేయం, ఊపిరితిత్తులు,లివర్ వంటి ప్రధాన అవయవాలు పూర్తిగా డామేజ్ అయ్యాయని ఈ క్రమంలోనే శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వ్యాపించిందని వైద్యులు వెల్లడించారు.ఇలా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితిలో కూడా ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.
ప్రస్తుతం శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని మరికొన్ని గంటలు గడిస్తేనే ఈయన గురించి ఏ విషయమైనా చెప్పగలమని వైద్యులు తెలియజేశారు. ఇక నేడు సాయంత్రం కూడా ఈయన హెల్త్ బులిటెన్ విడుదల చేయబోతున్నట్లు శరత్ బాబు సన్నిహితులు వెల్లడించారు.ఇక శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.రామరాజ్యం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన తెలుగు తమిళ కన్నడ భాషలలో సుమారు 200 కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…