Keerthi Bhatt: బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కీర్తి భట్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నారు ఇలా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమె ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈమె తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో విషాదం నింపుకొని ఉందనే విషయం మనకు తెలిసిందే.
రోడ్డు ప్రమాదంలో తన కుటుంబ సభ్యులందరూ చనిపోయి ఈమె ఒక్కటే మిగిలిన విషయాన్ని బిగ్ బాస్ కార్యక్రమంలో తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఇలా తన ఫ్యామిలీలో ఒక్కతినే మిగలటం తనకు ఎవరూ లేకపోవడం తనని ఎంతగానో కృంగదీసింది అయితే తాజాగా ఈమె కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది.
హీరో విజయ కార్తీక్ తోట నటి కీర్తిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమైన బోనాల జాతర కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ ఉంగరాలు మార్చుకొని నిశ్చితార్థం జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈమె మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
నేను నీకు తోడుగా ఉంటాను… నీకు నేను సపోర్ట్ గా ఉంటా… మీ పేరెంట్స్ ను నా పేరెంట్స్ అనుకుంటా.. కానీ నన్ను వదలకుండా చూసుకో అంటూ ఎమోషనల్ అయ్యారు.అనంతరం వేదికపై ఉన్నటువంటి తన అత్తమామల గురించి కూడా మాట్లాడుతూ ప్రమాదంలో నేను తల్లిని అయ్యే యోగం కోల్పోయాను తన వంశాన్ని ముందుకు తీసుకువెళ్లలేదని చెప్పడంతో తన తల్లిదండ్రులు నీకు మరొక పాప ఎందుకు నువ్వే మాకు పాపవు అవసరమైతే ఒక చిన్నారిని దత్తత తీసుకుందామని తనకు చెప్పారని చెబుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఇలా ఈమె పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలియడంతో ఇకపై తన జీవితం చాలా సంతోషంగా ఉండాలని అందరూ భావిస్తున్నారు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…
ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…