Keerthi suresh Mother: సాధారణంగా ప్రేక్షకులకు ఏదైనా పాట నచ్చితే దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఎన్నో పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇలా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పాటలలో ” చంకీల అంగీలేసి ఓ వదినే” అనే పాట కూడా ఒకటి . ఇక్కడ చూసినా కూడా ఈ పాటే వినిపిస్తోంది. హీరో నాని, కీర్తీ సురేష్ జంటగా నటించిన దసరా సినిమాలోని ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
చిన్న , పెద్ద అని తేడా లేకుండా అందరూ ఈ పాటకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ పాటలు స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ తల్లి, అలనాటి నటి మేనక కూడా ఈ పాటకు చిందులు వేసింది. చంకీల అంగీలేసి అంటూ కూతురి పాటకు అద్భుతమైన డాన్స్ చేసింది. ఈ డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాకుండా తమిళ్ వర్శన్ లో ఈ పాటకు తన కుమార్తె భర్త తో కలిసి మేనక స్టెప్పులు వేసింది.
దసరా ఫీవర్ అంటూ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా మంచు లక్ష్మీ ప్రసన్న కూడా ఈ పాటకు తన కూతురితో కలిసి స్టెప్పులు వేసింది. ఈ సందర్భంగా దసరా సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో డాన్స్ వీడియో ని షేర్ చేసింది. నాని , కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
దసరా శోభను తెచ్చిన నాని…
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన దసరా సినిమా ఇటీవల విడుదలై మరొకసారి ప్రేక్షకులకు దసరా శోభని తీసుకువచ్చింది. మార్చి 30 వ తేదీ విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుండి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నాని ఇద్దరు పోటీపడి నటించినట్లుగా ఉంది. ఈ సినిమాతో నాని పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…