Shaakuntalam: ప్రముఖ దర్శకుడు గుశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం శాకుంతలం. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనులను చిత్ర బృందం వేగవంతం చేసింది.
ఈ ప్రమోషన్ పనులలో భాగంగా ఇప్పటికే సమంత పలు ఇంటర్వ్యూలలో పాల్గొంది. తాజాగా ఈ సినిమా దర్శకుడు గుణశేఖర్ కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనే సినిమా గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గుణశేఖర్ మాట్లాడుతూ..” శాకుంతలం సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి మూడు సంవత్సరాల సమయం పట్టిందని తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆరు నెలలు సమయం అనుకున్నాము. కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తి కావటానికి 81 రోజుల సమయం పట్టింది.
ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏడాదిన్నర సమయం పట్టింది. మొత్తానికి సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి మూడు సంవత్సరాలు కాలం పట్టింది అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమాలో శకుంతల పాత్ర కోసం మొదట సమంతని ఎన్నుకొలేదని తెలిపాడు. శాకుంతలం సినిమా తీయాలనుకున్నపుడు శకుంతల పాత్ర కోసం సమంతని అనుకోలేదు. కానీ ఆ పాత్రకి సమంత సరిగ్గా సరిపోతుందని నా కూతురు సమంత పేరుని సూచించింది అంటూ చెప్పుకొచ్చాడు.
రంగస్థలం సినిమా చూసాకే…
ఈ సినిమాలో పాత్ర కోసం సమంతని సంప్రదించడానికి ముందు ఆమె నటించిన రంగస్థలం సినిమా చూశా. ఆ సినిమా చూసిన తర్వాత సినిమా కోసం సమంత తన పాత్రలో ఎంతగాలీనమైందో అర్థం అయింది. ఆ సినిమా చూసిన తర్వాతనే ఆమె ఏ పాత్రలో అయినా లీనమైపోతుందని భావించి శకుంతల పాత్ర కోసం ఆమెను సంప్రదించాను అంటూ గుణశేఖర్ చెప్పుకొచ్చాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…