Kirak Rp: పవన్ కళ్యాణ్ కోసం వేల మందిని బీహార్ నుంచి దింపారు.. ఆర్పీ సంచలన వ్యాఖ్యలు!

Kirak Rp: జబర్దస్త్ కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో తన కామెడీ డైలాగుల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు అయితే మల్లెమాల వారితో ఈయనకి వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఈ కార్యక్రమం నుంచి దూరంగా వచ్చి మల్లెమాల వారి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్న తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈయన రాజకీయపరంగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. కూటమికి మద్దతు తెలియజేస్తూనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్ల చేస్తే వ్యాఖ్యలు సంచలనాలకు కారణమవుతున్న ఇటీవల వినుకొండ హత్య కేసులో భాగంగా ఇటీవల ఆర్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ వినకొండలో జరిగిన హత్యలో భాగంగా చనిపోయిన రషీద్ చంపబడిన జిలాని ఇద్దరు కూడా ముస్లిం మైనారిటీస్ అని తెలిపారు. వారిద్దరికీ పాత కక్షలు ఉన్నాయని వారిద్దరూ వైసీపీకి చెందిన వాళ్లేనని ఆర్పీ తెలిపారు. ఇలా ఇద్దరు వైసిపికి చెందినవారు కాకపోతే ఏదో ఫోటోలు కాస్త బయటకు రావడంతో టీడీపీకి చెందిన వ్యక్తి జిలాని అని ఆయన పై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

పవన్ పై దాడి..
అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రావణ కాష్టం చూడటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అయితే పవన్ కళ్యాణ్ పై దాడి చేయించడానికి ఈయన వేల సంఖ్యలో మనుషులను బీహార్ నుంచి తెప్పించారని కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలా ఆర్పీ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago