ఇటీవలే వరుసగా ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ సిరీస్ లు గెలిచి మంచి ఊపు మీద ఉంది టీం ఇండియా.. ఇప్పుడు జట్టు ఉన్న ఫామ్ ఎప్పుడు కూడా లేదని చెప్పొచ్చు.. బెంచ్ కి పరిమితమైన వారు కూడా ఛాన్స్ రాగానే తమ సత్తా చాటి ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తున్నారు.. సిరాజ్, శుభమన్ గిల్, వాషింగ్ టన్ సుందర్ లు ఇటీవలే ఛాన్స్ లు రాగానే రాణించి తమ సత్తా చూపించారు. ఇక మొన్నటి టెస్ట్ సిరీస్ విజయంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించగా అదే టైం లో ఆసియ కప్ ఉండడం ఇప్పుడు కొంత ఆసక్తిని రేకెత్తిస్తుంది. తొలుత టీమిండియా ఫైనల్‌కి అర్హత సాధిస్తే, ఆసియా కప్ 2021 వచ్చే ఏడాదికి వాయిదా పడుతుందని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్ ప్రకటించినా, ఈ టోర్నీని వాయిదా వేసేందుకు ఐసీసీ సుముఖంగా లేదని సమాచారం..
జూన్ 18 నుంచి 22 వరకూ ఇంగ్లాండ్‌లోని సౌంతమ్టన్‌లో న్యూజిలాండ్, ఇండియా మధ్య ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీని కోసమే ఐపీఎల్‌ను కూడా ముందుకు జరిపింది బీసీసీఐ. ముందుగా జూన్ 5న ఐపీఎల్ ముగించాలని భావించినా, భారత క్రికెటర్లకు తగినంత విశ్రాంతినిచ్చేందుకు మే 30న ముగించనుంది.అయితే షెడ్యూల్ ప్రకారం జూన్‌లో టీమిండియా, శ్రీలంకలో పర్యటించాల్సి ఉంటుంది. ఆసియా కప్ 2021 ప్రారంభానికి ముందు శ్రీలంకతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంది టీమిండియా.
అయితే టెస్టు ఛాంపియన్‌షిప్ కారణంగా ఈ సిరీస్ వాయిదా పడే అవకాశం ఉంది… అయితే శ్రీలంక సిరీస్ తర్వాత అక్కడే ఆసియా కప్ 2021 ఆడనుంది భారత జట్టు. నిజానికి 2020లోనే ఆసియా కప్ జరగాల్సి ఉన్నా, కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. దీంతో బీసీసీఐ రెండు జట్లుగా చీల్చి ఈ టోర్నీలను ఆడాలని భావిస్తుంది.. ఆ రెండు జట్లకు రాహుల్, విరాట్ కోహ్లీ లు సారథ్యం వహిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇంగ్లాండ్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇయాన్ మోర్గాన్, టెస్టుల్లో జో రూట్ కెప్టెన్‌గా వ్యవహారిస్తుంటే, ఆస్ట్రేలియాకు వన్డే, టీ20ల్లో ఆరోన్ ఫించ్, టెస్టుల్లో టిమ్ పైన్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. అదీకాకుండా ఇలా విభజించడం వల్ల టీమిండియాకు భవిష్యత్ కెప్టెన్‌ను ఎంచుకునే అవకాశం కూడా దొరుకుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…