కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ కావాలా.. అయితే ఇలా చేయండి!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే మరోవైపు కరోనా రెండవ దశ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే మనం ఒకచోట నుంచి మరొక చోటుకు ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా కరోనా పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ కూడా మనకు ప్రయాణాలలో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే మనం వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ ఏ విధంగా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం…

కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్న తరువాత మనం వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను ఆరోగ్య సేతు యాప్, కొవిన్ పొర్టల్ వంటి ఎన్నో యాప్స్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా కోవిన్ యాప్ ద్వారా సర్టిఫికెట్ పొందడం కోసం కొవిన్ పొర్టల్ https://selfregistration.cowin.gov.in/ లింక్ ఓపెన్ చేయాలి. లింక్ ఓపెన్ కాగానే మీ రిఫరెన్స్ ఐడీని ఎంటర్ చేయాలి. ఐడి ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ పై క్లిక్ చేయగానే మనకు స్క్రీన్ పై డౌన్లోడ్ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మన ఫోన్ లో వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది.

కొందరి ఫోన్లలో కోవిన్ యాప్ అందుబాటులో లేకపోతే కోవిన్ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ప్లే స్టోర్, ఆరోగ్య సేతు వంటి యాప్స్ ను అప్డేట్ చేసుకున్న తర్వాత కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కోవిన్ ట్యాబ్ పై క్లిక్ చేసి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఆప్షన్ పై Click చేయాలి. తరువాత Beneficiary ఐ డి ఎంటర్ చేయగానే గేట్ సర్టిఫికెట్ అనే ఆప్షన్ వస్తుంది.ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మన ఫోన్లో వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది.ఈ విధంగా మనం వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికేట్ ని డౌన్లోడ్ చేసుకొని నిరభ్యంతరంగా ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు.